పొంగులేటి కాదు— పొంగు'లూటీ'
సరుకు లేనప్పుడు తిట్ల రాగాన్ని అందుకున్నారు.
అసెంబ్లీ సాక్షిగా సి ఎం, మైనింగ్ మంత్రి చెప్పింది తప్పా.
ప్రభుత్వ భూమి అయితే హైడ్రా ఎక్కడికి పోయింది.
సచివాలయం సాక్షిగా రాఘవ కన్స్ట్రక్షన్ మీద పొంగులేటి అబద్దాలు: మాజీ మంత్రి హరీష్ రావు
వనపర్తి,(విజయక్రాంతి): అంబేద్కర్ సచివాలయం లో జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో మంత్రి పొంగులేటి మాట్లాడిన పొగరు లేటి మాటలు అందరు విన్నామని ఒకవైపు అంబేద్కర్, మరొక వైపు అమ్మవారు, బిర్లా మందిరం సాక్షిగా రాఘవ కన్స్ట్రక్షన్ మీద నిజాలు దాటి అబద్దాలు మాట్లాడారని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. గురువారం వనపర్తి జిల్లా రేవల్లి మండలం నాగపూర్ గ్రామంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాజీ మంత్రులు సింగిరెడ్డి నిరంజన్ రెడ్డీ, లక్ష్మా రెడ్డీ, శ్రీనివాస్ గౌడ్, మాజీ ఎమ్మెల్యే లు అల వెంకటేశ్వర్ రెడ్డీ, అంజయ్య యాదవ్, రాష్ట్ర నాయకులు ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్, నాగం తిరుపతి రెడ్డీ లతో కలిసి ఆయన మాట్లాడారు. పొంగులేటి కాదు పొంగు లూటి పొగరు లూటి బాంబ్ లేటి మైనింగ్ లూటి అని ఆయన ఎద్దేవా చేశారు. ఆయన మాటలను చూస్తుంటే అర్థం అవుతుందని సరుకు లేనప్పుడు తిట్ల రాగాన్ని అందుకున్నారన్నారని తెలిపారు.
రాఘవ కన్స్ట్రక్షన్ సంస్థ ను కాపాడు కోవాలని బయట పడాలని తాపత్రయం కనిపించింది తాను ఒక్కడే కాదు అందరు దొంగలని రాష్ట్ర ములోని అందరి కుంభ కోణాలు బయట పెట్టె ప్రయత్నం కనిపించిందని ఈ విషయాలంటిని పొంగులేటి కాదు పొంగుళూటి అని చెప్పకనే చెప్పాడన్నారు. అసెంబ్లీ సాక్షిగా రాఘవ కన్స్ట్రక్షన్ గురుంచి సి ఎం రేవంత్ రెడ్డీ చెప్పాడని మా అధికారులు గుర్తు పట్టారని పెనాలిటీ వేసాము అని శాసనసభలో చెప్పాడని , మైనింగ్ మంత్రి సైతం చెప్పాడని ఆయన వివరించారు. రెవిన్యూ, విద్యుత్, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారులు రాఘవ క్రషర్ కు నోటీసులు ఇచ్చారని ఇవ్వని తప్పా లేకపోతే బాంబ్ లేటి పొగరులేటి చెప్పింది తప్ప అని ఆయన ప్రశ్నించారు.
రాఘవ కన్స్ట్రక్షన్ పైన అటు అసెంబ్లీ లో ఇటు అధికారులు చెప్పినప్పుడు ఇది నాది కాదు అని ఎందుకు చెప్పలేకపోయావు అని, 12 రోజులు తరువాత తమరికి గుర్తు కు వచ్చిందా అని మంత్రి పొంగులేటి ని ఆయన ప్రశ్నించారు. మైనింగ్ మీది కాకపోతే అక్కడ కాంగ్రెస్ జెండా, కంటెనర్ మీద రాఘవ కన్స్ట్రక్షన్ పేరు ఎందుకు ఉంది , మైనింగ్ శాఖ నోటీసులు ఇస్తే మీ అధికారి సంతకం పెట్టింది నిజం కాదా ఆ ఆధారాలను కదా తాను అసెంబ్లీ లో చూపించిందని ఆయన ప్రశ్నించారు. బి ఆర్ ఎస్ హయాంలో 2016 లో ఈ భూములను నిషేధిత జాబితా లో పెట్టి కాపాడింది తామేనని హైకోర్టు, డివిజన్ బెంచ్ లకు కంపెనీ లు పోతే కూడా ఈ భూములు సీలింగ్ భూములను అని తీర్పు వచ్చింది వాస్తవం కదా అని ఆయన గుర్తు చేశారు.
ఈ భూములు ప్రభుత్వ భూములని ప్రభుత్వం సుప్రీం కోర్టు లో వేసాము అని ప్రభుత్వం చెబుతుందని కదా మరి ఏ కె స్క్వేర్ వెనుక ఉన్నది మీ కొడుకు భాగస్వామి కాదా అని మరి ఎందుకు రోజుకు ఒక పేరు ఒకనాడు కోహినూర్, మరో రోజు శిల్ప, ఇలా రోజుకొక పేరు బోర్డు ఎందుకు మారుతుందని ఆయన ప్రశ్నించారు. ప్రభుత్వం భూమిలో పేదలు ఇండ్ల నిర్మాణం చేపడితే రాత్రికి రాత్రే ఇండ్లు కూలగోడుతున్నారు కదా ఇంత అవినీతి కబ్జా జరిగిందని అటు అసెంబ్లీ సాక్షిగా సీఎం రేవంత్ రెడ్డీ, మైనింగ్ మంత్రి వివేక్ లు ఇటు నాలుగు శాఖల అధికారులు చెబుతున్న ప్రభుత్వ భూమి అయితే ఎందుకు హైడ్రా ఎక్కడికి పోయిందని ఆయన ప్రశ్నించారు.
ప్రభుత్వ భూమి అయితే హైడ్రాను పంపించి ప్రభుత్వం నిజాయితీ నిరూపించుకోవాలని ఆయన సవాల్ విసిరారు. మైనింగ్ గురుంచి సి ఎం రేవంత్ రెడ్డీ, మంత్రి వివేక్, నాలుగు శాఖల అధికారులు చెప్పింది అబద్దమా లేకపోతే మంత్రి పొంగులేటి చెప్పింది అబద్దమా మీ ప్రభుత్వం అధికారులు చెప్పింది అబద్దం అయితే అసెంబ్లీ లో అబద్దం అని చెప్పాలని లేకపోతే మీరు చెప్పింది అబద్దం అయితే అసెంబ్లీ సాక్షిగా ప్రజలకు క్షమాపణ చెప్పాలని మంత్రి పొంగులేటి ని ఆయన డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు




