12 July, 2026 | 2:37 AM

జనాభా క్షీణత కొనసాగితే ప్రమాదం

02-12-2024 01:59 AM

ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ మోహన్ భగవత్

న్యూఢిల్లీ, డిసెంబర్ 1: జనాభా తగ్గుదలపై ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ మోహన్ భగ వత్ ఆందోళన వ్యక్తం చేశారు. నాగ్‌పుర్‌లో నిర్వహించిన ఓ కార్యక్రమంలో  మాట్లాడుతూ.. జనాభా క్షీణత కొనసాగితే సమాజం దానంతట అదే నశించి పోతుందన్నారు. ‘జనాభా తగ్గుదల  ఆం దోళనకరమైన అంశం. సంతానోత్పత్తి రేటు 2.1 కంటే తక్కువైతే సమాజం మ నుగడను కోల్పోతుంది. దాన్ని ఎవరూ అంతం చేయాల్సిన అవసరం లేదు. ఈ సమస్యతో ఇప్పటికే అనేక భాషలు, సం స్కృతులు కనుమరుగయ్యాయి. మన దేశంలో సంతానోత్ప త్తి రేటు కనీసం 3 గా ఉండాలి’ అని  పేర్కొన్నారు.