9 April, 2026 | 11:01 PM

Breaking News

అల్లూరి జిల్లాలో విషాదం— సెల్ఫీ సరదా విషాదంగా మారింది.. జలపాతంలో పడి ముగ్గురు మృతి   •   బాన్సువాడలో పలు రైస్ డిపోలపై సివిల్ సప్లై అధికారుల దాడులు   •   కేరళలో 75 శాతం పోలింగ్‌ నమోదు   •   ప్రగతి నగర్‌లో ఘనంగా ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశాలు   •   ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్న సమస్యలను సత్వరమే పరిష్కరించాలి...   •   హెచ్ఐవిపై విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలి   •   ఏజెన్సీ ప్రాంత రైతుల భూ సమస్యలను పరిష్కరించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు   •   హనుమకొండ జిల్లాను వరంగల్ జిల్లాలో కలిపి మహానగరాన్ని అభివృద్ధి చేయండి   •   బీజేపీ ఆధ్వర్యంలో ఆయుష్మాన్ భారత్ హెల్త్ కార్డు నమోదు   •   ప్రభుత్వ విద్య బలోపేతానికి కృషి చేస్తా..   •  

మౌలిక సమస్యల పరిష్కారం కోసం కృషి చేయాలి

16-02-2026 07:00 PM

ఎంపీడీఓ ఆంజనేయులు

మోతె,(విజయక్రాంతి): గ్రామాలలో మౌలిక సమస్యల పరిష్కారం, కోసం ప్రతి వార్డు సభ్యులు, కృషి చేయాలని, యంపిడిఓ తిప్పని ఆంజనేయులు అన్నారు. సోమవారం మండల కేంద్రంలో శ్రీ శక్తి భవన్ లో జరిగిన వార్డు సభ్యుల, మొదటి విడత మొదటి రోజు శిక్షణ కార్యక్రమంలో పాల్గొని, ఆయన మాట్లాడుతూ... ప్రతి ఒక్క సభ్యులు నిరంతరం ప్రజల సమస్యలు, తెలుసుకొని అధికారుల దృష్టికి తీసుకరావాలని, త్రాగు నీటి, సమస్యలు వీధి దీపాల సమస్యతో పాటు గ్రామంలో ఏ మూల పారిశుద్యం లోపించిన,

గ్రామ కార్యదర్శి దృష్టికి తెచ్చి వెంటనే సమస్య లేకుండా చూడాలని, మురుగు కాల్వలు ఎప్పటికప్పుడు శుభ్రం చేసే విధంగా గ్రామ పంచాయతీ సిబ్బదితో సేవలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. నేటికి గ్రామాలలో వసూలు కానీ ఇంటి పన్నులకు గ్రామ కార్యదర్శికి సహకరించి, ఇంటి పన్నులు వసూలు చేయించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో శిక్షకులు రాము, వెంకన్న, ఆయా గ్రామాల వార్డు సభ్యులు  ఈశ్వరి రవి, అశ్విని రామోజీ, కోర్ర లక్పతి, అమ్మి కిట్టు, బాసు, వీరబాబు, రమేష్, యశోద తదితరులు పాల్గొన్నారు.