28-12-2025 12:00:00 AM
ఎస్‌ఏహెచ్ నుంచి కాపాడిన శ్రీ శ్రీ హోలిస్టిక్ ఆస్పత్రి వైద్యులు
59 సంవత్సరాల వయసున్న గోపరాజు పద్మ అనే మహిళ అకస్మాత్తుగా తీవ్రమైన తలనొప్పి రావడంతో కొండాపూర్‌లోని శ్రీ శ్రీ హోలిస్టిక్ ఆస్పత్రిలో చేరారు. ఆమెకు సీటీ స్కాన్ నిర్వహించగా, మెదడులో ప్రమాదకరమైన రక్తస్రావం (సబ్ -అరాక్నోయిడ్ హెమరేజ్ , ఎస్‌ఏహెచ్) జరిగినట్లు వైద్యులు గుర్తించారు.
యాంజియోగ్రఫీ పరీక్ష ద్వారా మెదడులోని ఒక రక్తనాళం ఉబ్బి, అది పగిలిపోవడం వల్ల ఈ రక్తస్రావం జరుగుతోందని తేలింది. ఇంటర్వెన్షనల్ న్యూరాలజిస్ట్ డాక్టర్ మనోజ్ వాసిరెడ్డి, పరిస్థితి తీవ్రతను గమనించి అత్యవసరంగా ‘ఎండోవాస్క్యులర్ అన్యూరిజం కోయిలింగ్’ ప్రక్రియను నిర్వహించి, మరింత రక్తస్రావం జరగకుండా అడ్డుకున్నారు.
చికిత్సా విధానం
ఈ విధానంలో మెదడుకు ఎటువంటి ఓపెన్ సర్జరీ అవసరం ఉండదు. తొడ భాగం ద్వారా ఒక చిన్న రంధ్రం చేసి, దాని ద్వారా అతి సన్నని ’మైక్రోకాథెటర్’ను మెదడులోని అనూరిజం ఉన్న ప్రదేశానికి పంపారు. అక్కడ ప్లాటినం కాయిల్స్ను అమర్చి, పగిలిన రక్తనాళం నుండి రక్తం బయటకు రాకుండా అన్యూరిజంను సురక్షితంగా మూసివేశారు. చికిత్స తర్వాత న్యూరో ఐసియులో పర్యవేక్షణలో ఉన్న గోపరాజు పద్మ ఆరోగ్యం వేగంగా మెరుగుపడింది. ఎటువంటి కొత్త శారీరక లేదా నాడీ సంబంధిత లోపాలు లేకుండా ఆమె ప్రస్తుతం క్షేమంగా కోలుకుంటున్నారు.
వైద్యుల సూచన
‘సబ్-అరాక్నోయిడ్ హెమరేజ్ సంభవించినప్పుడు తక్షణమే స్పందించడం చాలా ముఖ్యం. వ్యాధిని ముందుగా గుర్తించి, సరైన సమయంలో కాయిలింగ్ చేయడం ద్వారా రోగి ప్రాణాలను కాపాడవచ్చు,‘ అని డాక్టర్ మనోజ్ వాసిరెడ్డి తెలిపారు. కొండాపూర్‌లోని శ్రీ శ్రీ హోలిస్టిక్ హాస్పిటల్‌లో అందుబాటులో ఉన్న అత్యాధునిక న్యూరో-ఇంటర్వెన్షనల్ నైపుణ్యం, వేగవంతమైన వైద్య చర్యలు ఎంత కీలకమో మరోసారి స్పష్టమవుతోంది.
డాక్టర్ మనోజ్ వాసిరెడ్డి (కన్సల్టెంట్ ఇంటర్వెన్షనల్ న్యూరాలజిస్ట్, శ్రీశ్రీ హోలిస్టిక్ హాస్పిటల్, కొండాపూర్)