28-12-2025 12:00:00 AM
‘ఎఫ్‌ఈఎస్సీ’గా డాక్టర్ లోకేశ్వరరావు
హైదరాబాద్‌లోని స్టార్ హాస్పిటల్‌లో సీనియర్ కన్సల్టెంట్ కార్డియోథొరాసిక్ సర్జన్, కార్డియోవాస్కులర్ సర్జికల్ రీసెర్చ్ డైరెక్టర్‌గా సేవలందిస్తున్న డాక్టర్ లోకేశ్వరరావు సజ్జా.. ‘ఫెలో ఆఫ్ ది యూ రోపియన్ సొసైటీ ఆఫ్ కార్డియాలజీ’ (ఎఫ్‌ఈఎస్సీ)గా ఎన్నికయ్యారు.
ఇది కార్డియో వాస్కులర్ సైన్స్, క్లినికల్ నాయకత్వంలో విశేష ప్రతిభ కనబరిచిన వారికి ఇచ్చే ప్రతిష్టాత్మక అంతర్జాతీయ గుర్తింపు. భారత్ నుంచి ఈ గౌరవాన్ని అందుకున్న కొద్దిమంది కార్డియోథొరాసిక్ సర్జన్లలో సజ్జా ఒకరిగా నిలిచారు. ౨ దశాబ్దాలకు పైగా హృదయ శస్త్రచికిత్స, క్లినికల్ పరిశోధన, ఆవిష్కరణల్లో ఆయన చేసిన సేవలకు ఇది గుర్తింపుగా నిలుస్తుంది.
1950లో ఈఎస్సీ స్థాపన
1950లో స్థాపించబడిన ఈఎస్సీ.. ప్రపంచంలోనే అతిపెద్ద, అత్యంత ప్రభావవంతమైన కార్డియోవాస్కులర్ వృత్తి పరమైన సంస్థలలో ఒకటి. 150 దేశాల్లోని లక్ష కంటే ఎక్కువ మంది నిపుణులు ఇందులో సభ్యులుగా ఉన్నారు. అంతర్జాతీయ క్లినికల్ గైడ్‌లైన్సు రూపొందించడంలో, పరిశోధనలను ప్రోత్సహించడంలో, వైద్య విద్యలో అత్యున్నత ప్రమాణాలను నెలకొల్పడంలో ఈ సంస్థ కీలక పాత్ర పోషిస్తుంది.
డాక్టర్ సజ్జా ప్రస్థానం
స్టార్ హాస్పిటల్స్ ప్రారంభం నుంచి డాక్టర్ సజ్జా దానితో అనుబంధం కలిగి ఉన్నారు. తన సుదీర్ఘ వృత్తి జీవితంలో ఆయన 22,500 కంటే ఎక్కువ గుండె శస్త్రచికిత్సలు నిర్వహించారు. ఇందులో 17 వలే కంటే ఎక్కువ కరోనరీ ఆర్టరీ బైపాస్ సర్జరీలు ఉన్నాయి. ‘బీటింగ్ హార్ట్’ సర్జరీ, మల్టీ-ఆర్టీరియల్ గ్రాఫ్టింగ్, సంక్లిష్టమైన వాల్వ్ సర్జరీలలో ఆయనకు అంతర్జాతీయ గుర్తింపు ఉంది.
భారతదేశంలో కార్డియాక్ రీసెర్చ్‌లో మార్గదర్శకుడైన డాక్టర్ సజ్జా.. దేశంలోనే మొట్టమొదటి రాండమైజ్డ్ కంట్రోల్ ట్రయల్ నిర్వహించారు. ప్రస్తుతం ఆయన ఐసీఎంఆర్ సహకారంతో జరుగుతున్న ‘ప్రిడిక్ట్ ట్రయల్’కు నాయకత్వం వహిస్తున్నారు. ఇప్పటివరకు ఆయన జాతీయ, అంతర్జాతీయ జర్నల్స్‌లో 125 కంటే ఎక్కువ శాస్త్రీయ పరిశోధనా పత్రాలను ప్రచురించారు.
డాక్టర్ సజ్జా గతంలో ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ కార్డియోవాస్కులర్-థొరాసిక్ సర్జన్స్ అధ్యక్షుడిగా (2023 పనిచేశారు. ’సొసైటీ ఆఫ్ కరోనరీ సర్జన్స్’ వ్యవస్థాపక అధ్యక్షుడిగా ఉన్నారు. అలాగే, అమెరికన్ అ సోసియేషన్ ఫర్ థొరాసిక్ సర్జరీలో క్రియాశీల సభ్యులుగా కొనసాగుతున్నారు. డాక్టర్ సజ్జా యూరోపియన్ సొసైటీ ఆఫ్ కార్డియాలజీ ఫెలోగా ఎన్నికవ్వడం అనేది, గుండె సంబంధిత వైద్య సంరక్షణ, క్లినికల్ ఆవిష్కరణలు, పరిశోధనా నాయకత్వంలో భారతదేశం సాధిస్తున్న అంతర్జాతీయ గుర్తింపుకు నిదర్శనం.
డాక్టర్ లోకేశ్వరరావు సజ్జా, సీనియర్ కన్సల్టెంట్ కార్డియోథొరాసిక్ సర్జన్, కార్డియోవాస్కులర్ సర్జికల్ రీసెర్చ్ డైరెక్టర్, స్టార్ హాస్పిటల్, హైదరాబాద్