calender_icon.png 27 December, 2025 | 3:28 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కిలో వెండి రూ.2.37లక్షలు

27-12-2025 01:38:34 AM

తొమ్మిది రోజుల్లోనే ధర రూ.29 వేలు పెరుగుదల

హైదరాబాద్, డిసెంబర్ 26(విజయక్రాంతి): వెండి ధరలు ధగధగ లాడుతున్నాయి. దేశీయ మార్కెట్‌లో  రోజురోజుకూ సిల్వర్ ధరలు ఆకాశానం టుతూ రికార్డులు కొల్లగొడుతూ పరుగు తీస్తోంది. హైదరాబాద్‌లో శుక్రవారం కేజీ వెండి ధర ఏకంగా రూ.2.37 లక్షలు పలికింది. ఇక 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం 10 గ్రాముల ధర ఒక దశలో రూ.1.42,800లకు చేరింది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,28,350గా ఉంది.

అంతర్జాతీయ మార్కెట్‌లోనూ వీటి ధరలు విపరీతంగా మండుతున్నాయి. ఔ న్సు పసిడి ధర 4,507 డాలర్లు, వెండి ధర 75 డాలర్లకు చేరింది. ఈ నెల 18 నుంచి వెండి ధర దాదాపు రూ.29 వేలు (14.33 శాతం) పెరిగింది. ఈ ఏడాదిలో ఇప్పటికే పసిడి ధర దాదాపు 70శాతం వరకు ఎగబాకింది. 1979 తర్వాత ఇదే అతిపెద్ద వార్షిక లాభమని నిపుణులు పేర్కొంటున్నారు. 2026 ప్రారంభంలోనూ ఈ లోహాల ధర లు పరుగులు పెట్టొచ్చని అంచనా వేస్తున్నారు.