07-12-2025 09:48:07 AM
తిరుపతి: తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. వరుస సెలవులు కావడంతో వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని 20 కంపార్ట్ మెంట్లలో వేచివున్న భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 15 గంటల సమయం పడుతోంది. నిన్న శ్రీవారిని 82,007 మంది భక్తులు దర్శించుకున్నారు. 39,154 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. శ్రీవారికి కానుకల రూపంలో రూ.3.13 కోట్ల హుండీ ఆదాయం వచ్చిందని టీటీడీ అధికారులు వెల్లడించారు. టైంస్లాట్ టికెట్లు కలిగిన భక్తులకు 6 గంటలు, ప్రత్యేక ప్రవేశ టికెట్లు కలిగిన భక్తులకు 5 గంటల్లో దర్శనమవుతోందని, సర్వదర్శనానికి టికెట్లు ఉన్న భక్తులు నిర్దేశించిన సమయానికే క్యూలోకి వెళ్లాలని టీటీడీ విజ్ఞప్తి చేసింది.