calender_icon.png 18 August, 2025 | 11:49 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తెలంగాణ ధిక్కార స్వరం దాశరథి

23-07-2024 01:24:28 AM

బీఆర్‌ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ 

హైదరాబాద్, జూలై 22 (విజయక్రాంతి) : దాశరథి స్పూర్తితోనే తెలం గాణ రాష్ట్ర సాధన కోసం సకల జనులను కలుపుకొని పోరాటాన్ని సాగిం చానని బీఆర్‌ఎస్ అధినేత కే చంద్రశేఖర్‌రావు పేర్కొన్నారు. దాశరథి శత జయంతి సందర్భంగా సోమవారం ఒక ప్రకటన విడుదల చేశా రు. తెలంగాణ ఆత్మగౌరవ ధిక్కార స్వరం, అభ్యుదయ కవి, రచయిత దాశరథి కృష్ణమాచార్య శతజయంతి సందర్భంగా యావత్ తెలంగాణ సమాజం ఆయన్ను స్మరించుకుంటోంది అన్నారు.

నా తెలంగాణ కోటి రతనాల వీణ అంటూ తన కవిత్వం ద్వారా తెలంగాణ ఆవశ్యకతను ప్రపంచానికి చాటి చెప్పిన మహోన్నత వ్యక్తి అని కొనియాడారు. తన సాహిత్యం ద్వారా తిమిరంతో సమరం చేస్తూ నాటి రైతాంగంలో సాయుధ పోరాట స్పూర్తిని రగిలించిన యోధుడు, బహుముఖ ప్రజ్ఞాశాలి దాశరథి అని గుర్తు చేశారు. తెలంగాణ ఆత్మగౌరవాన్ని అత్యున్నత శిఖరాలకు చేర్చిన దాశరథి కవిత్వం, సాహిత్యం తెలంగాణ భవిష్యత్తు తరాలకు నిత్య స్పూర్తిదాయకమన్నారు.