22 July, 2026 | 4:29 PM

కొమురవెల్లిలో దాశరథి జయంతి ఉత్సవాలు

22-07-2026 03:26 PM

కొమురవెల్లి,(విజయక్రాంతి): తెలంగాణ సాహితి దిగ్గజమైన దాశరథి కృష్ణమాచార్య 101వ జయంతి సందర్భంగా సాంస్కృతిక సారధి గాయకులు పిన్నింటి రత్నం ఆధ్వర్యంలో మండల కేంద్రంలోని పోలీస్ బొమ్మ వద్ద ఆయన చిత్రపటానికి పూలమాలవేసి, ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నేటి కవులకు, సాహితీవేత్తలకు మార్గం నిర్దేశకులని పేర్కొన్నారు. తెలంగాణ కోటి రతనాల వీణ అని ఎలిగేత్తి చాటిన మహానీయుడని కొనియాడారు. నేటి తరం కవులు,కళాకారులు, సాహిత్య వేతలు ఆయన రచనలు స్ఫూర్తిదాయకంగా నిలుస్తాయన్నారు.