26 August, 2026 | 3:17 AM

అమ్మకానికి ఉమ్మెత్త కాయలు

26-08-2026 01:40 AM

అమెజాన్, స్విగ్గీ తదితర సంస్థల లైసెన్స్‌లు నిలిపివేత

కర్ణాటక ఆహార, ఔషధ భద్రతా విభాగం నిర్ణయం

ఆన్‌లైన్ లిస్టింగ్ నుంచి తొలగించాలని ఉత్తర్వులు

ఉత్పత్తులపై వాణిజ్య ప్రకటనలివ్వొద్దని ఆదేశాలు

బెంగళూరు, ఆగస్టు ౨౫: ఉమ్మెత్త పండు, విత్తనాలను ఆహార పదార్థాలుగా ఆన్‌లైన్‌లో విక్రయిస్తున్న అమెజాన్, స్విగ్గీ ఇన్‌స్టామార్ట్, బిగ్‌బాస్కెట్ వంటి ఈఢై కామర్స్ ప్లాట్‌ఫాంల ఫుడ్ లైసెన్సులను కర్ణాటక ఆహార, ఔషధ భద్రతా విభాగం (ఎఫ్‌డీఏ) మంగళవారం నిలిపివేసింది.

ఆయా ఈఢై కామర్స్ సంస్థలు తక్షణం ఉమ్మెత్త ఉత్పత్తులను ఆన్‌లైన్ లిస్టిం గ్ జాబితా నుంచి తొలగించాలని, ఆ ఉత్పత్తులపై ఎలాంటి వాణిజ్య ప్రకటనలు విడుద ల చేయవద్దని ఉత్తర్వులు జారీ చేసింది. విషపూరితమైన ఈ ఉమ్మెత్త ఉత్పత్తులు మాన వాళి చేటు చేస్తాయని, వాటి విక్రయాలు చట్టవిరుద్ధమని పేర్కొంది.

ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ యాక్ట్ 2006 ప్రకారం ఈ ఉత్తర్వులు జారీ చేశామని స్పష్టం చేసింది. తమ సిబ్బంది ఇటీవల రాష్ట్రంలోని కొన్ని ఈఢై కామర్స్ వేర్‌హౌస్‌లలో ఉమ్మెత్త విత్తనాలు, పండ్ల ప్యాకెట్లను గుర్తించారని, కొన్ని ప్యాకెట్లపై ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ లైసెన్స్, రిజిస్ట్రేషన్ నం బర్లు ఉన్నట్లు గుర్తించి చర్యలకు పూనుకున్నామని స్పష్టం చేసింది.

వెంటనే ఆయా సంస్థలకు నోటీసులు జారీ చేశామని తెలిపింది. నోటీసులపై ‘బిగ్ బాస్కెట్’ స్పంది స్తూ.. సదరు ఉత్పత్తులను ‘మానవ వినియోగానికి కాదు’ అనే లేబుల్‌తో భవిష్యత్తులో విక్రయిస్తామని వివరణ ఇచ్చిందని స్పష్టం చేసింది. అలాగే, స్విగ్గీ ఇన్‌స్టామార్ట్ వివరణకు కొంత సమయం కోరిందని, అమెజాన్ నుంచి ఇప్పటివరకు ఎలాంటి స్పందన లేద ని వెల్లడించింది. నోటీసులపై ‘అమెజాన్’ ఎలాంటి వివరణ ఇవ్వలేదని, ‘స్విగ్గీ ఇన్‌స్టామార్ట్’ మాత్రం వివరణకు కాస్త సమయం కావాలని కోరిందని వివరించింది. తదుపరి ఆదేశాలు ఇచ్చేవరకూ ఆయా సంస్థల లైసెన్స్‌ల సస్పెన్షన్ కొనసాగుతుందని తేల్చి చెప్పింది.

ఎందుకంత ప్రమాదకారి? 

ఉమ్మెత్త మొక్క విషపూరితమైంది. మొక్కలోని ఏ భాగయూ మానవాళి వినియోగా నికి పనికికాదు. ముఖ్యంగా కాయల వినియోగం అత్యంత ప్రమాదకరం. కాయలను పొరపాటుకు ఎవరైనా తింటే, కొద్ది సమయంలోనే వారి నాడీ వ్యవస్థ దెబ్బతింటుంది. సదరు వ్యక్తి తీవ్ర అస్వస్థతకు గురవుతాడు. వారిలో గుండెకొట్టుకునే వేగం పెర గుతుంది. నోరు పొడిబారి, చూపు మసకబారుతుంది. శరీర ఉష్ణోగ్రతలు క్రమంగా పెరు గుతాయి. శరీరంలో విష ప్రభావం ఎక్కువైతే అపస్మారక స్థితిలోకి వెళ్లే ప్రమాదం ఉంది. మే నెలలో ఏపీలోని కాకినాడ జిల్లాలో సోషల్ మీడియాలో ఉమ్మెత్త కూర ఆరోగ్యానికి మంచిదనే ప్రచారం చూసి, ఓ కుటుం బం కూర తిని ఆసుపత్రి పాలైంది.