26 August, 2026 | 3:55 AM

కారుపై ప్రియురాలి ముద్దులు

26-08-2026 01:36 AM

ఒకటికాదు.. రెండు కాదు ఏకంగా 3,400 ముద్రలు

మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌లో యువకుడి నిర్వాకం

భోపాల్, ఆగస్టు 25: ప్రియుడి కారుపై ఏకంగా 3,400 ముద్దులు పెట్టిందో ప్రియురాలు. వింతచర్యతో అవాక్కైన పోలీసులు ప్రియుడికి ఫైన్ వేసి వాటిని శుభ్రం చేయించారు. వివరాల్లోకి వెళితే గ్వాలియర్‌కు చెందిన ఆదిత్య కారుపై అతని ప్రేయసి ముద్దు సింబల్స్ (లిపిస్టిక్స్)ను వేసింది.

ఈ స్విఫ్ట్ కారు నగర వీధుల్లో తిరుగుతూ సామాజిక మాధ్యమాల్లోనూ వైరల్‌గా మారింది. దీనిపై పోలీసుల దృష్టి వెళ్లడంతో కారుపై ఆరా తీసి తాజాగా పోలీసులు మంగళవారం రంగంలోకి దిగారు. నిబంధనలకు విరుద్ధంగా మార్పులు చేసినందుకు ఆదిత్యకు రూ. 5,500 ఫైన్ వేశారు. ముద్దు సింబల్స్‌ను శుభ్రం చేయించారు. విచారణలో తన సోషల్ ఖాతా కు ఫాలోవర్లను పెంచుకునేందుకు ఈ పనిచేశానని తెలిపాడు. ఇది నిబంధనలకు విరు ద్ధమని తనకు తెలియదన్నాడు.

ఆలోచన తనదే అయినా, తన ప్రియురాలితో అమలు చేయించానన్నాడు. రూ. 900 విలువైన లిపిస్టిక్‌లను వాడానని, 55 లక్షల వ్యూస్ వచ్చాయని తెలిపాడు. ఈ అంశంపై స్థానిక పోలీస్ స్టేషన్ ఇన్‌చార్జీ అభిషేక్ రఘువంశీ మాట్లాడుతూ.. రెండు రోజుల నుంచి సోషల్ మీడి యాలో ఈ వీడియో వైరల్‌గా మారడంతో ఆరా తీసి పటేల్ నగర్ సిటీలో తిరిగినట్లు, కారు థాటిపూర్‌కు చెందినదిగా గుర్తించి ప ట్టుకొని చట్టరీత్యా చర్యలు తీసుకున్నామని, యాజమానిని హెచ్చరించామని తెలిపారు.