calender_icon.png 28 January, 2026 | 4:49 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలి

28-01-2026 03:02:16 PM

తెలంగాణ గ్రామీణ బ్యాంక్ మేనేజర్ సంపత్ కుమార్

సదాశివనగర్ జనవరి 28(విజయక్రాంతి): పేద ప్రజలు రైతులు నిరుద్యోగుల కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వలు ప్రవేశ పెడుతున్న పథకాలను ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోని, ఆర్థికంగా లబ్ధి పొందాలని తెలంగాణ గ్రామీణ బ్యాంక్ మేనేజర్ సంపత్ కుమార్ అన్నారు. బుధవారం మండలంలోని కుప్రియాల్ గ్రామంలో ఖాతాదారులతో అవగాహన సమావేశం ఏర్పాటు చేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... విద్యా, బంగారం రుణాలు, సామాజిక భద్రత పథకాలు ప్రధానమంత్రి సురక్ష బీమా, జీవన జ్యోతి, భీమా యోజన, అటల్ పెన్షన్ యోజన, నగదు నగదు రహిత లావాదేవి లపై అవగాహన కల్పించారు. సైబర్ మోసాల  పట్ల జాగ్రత్త వహించాలని సూచించారు. ప్రభుత్వ పథకాలను నేరుగా బ్యాంకు సిబ్బందిని కలిసి సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో బ్యాంకు మేనేజర్ సంపత్ కుమార్,ఫీల్డ్ ఆఫీసర్ రాజగోపాల్,శ్రీకాంత్, సర్పంచ్ జంగం రాజమణి, ఉప సర్పంచ్ గున్నాల అన్వేష్ గౌడ్,గ్రామస్తులు, ఖాతాదారులు పాల్గొన్నారు.