28-01-2026 02:57:45 PM
జగదేవపూర్,(విజయక్రాంతి): జగదేవపూర్ మండల పరిధిలోని ఇటిక్యాల గ్రామా సర్పంచ్ దీన రాజలింగం ఆధ్వర్యంలో మెడిసిటీ హాస్పిటల్ వారి సౌజన్యం తో ఉచితంగా వైద్య శిభిరం ఏర్పాటు చేసారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ ప్రజలకు బి పి, షుగర్,మొదలైన పరీక్షలు చేసినట్లు తెలిపారు. ఎవరికైనా దీర్ఘ కలిక సమస్యలు ఉంటే పరిక్షల కోసం ఉచితంగా బస్సు సౌకర్యంతో మెడిసిటీ హాస్పిటల్ లో చేస్తారు అని తెలిపారు.
ఉచితంగా మందులు పంపిణి చేస్తున్నట్లు తెలిపారు.గ్రామ ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి అని సూచించారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ నరేష్, బిఆర్ఎస్ పార్టీ నాయకులు కనుక రాజు,మెడిసిటీ హాస్పిటల్ సిబ్బందిడా,మహా లక్ష్మి,డా,నీలేష్, డా వర్షిత మార్కెటింగ్ ఇంచార్జి సంజయ్, చెర్యలు, రాఘవేందర్ రెడ్డి, సిస్టర్ కవిత, కావ్య గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.