31 May, 2026 | 11:28 PM

Breaking News

సోనాల మండలంలో భారీ వర్షం.. జొన్న రైతుల్లో ఆందోళన   •   సీఎం ఓవర్సీస్ పథకానికి దరఖాస్తు చేసుకోండి   •   రిటైర్డ్ ఎంప్లాయిస్ అసోసియేషన్ తెలంగాణ జేఏసితో ప్రభుత్వం చర్చలు జరపాలి   •   విద్యుత్ కాంట్రాక్టర్ ఒత్తిల్లు... గాల్లో దీపంలా లేబర్ బ్రతుకులు   •   టీఎన్జీవోల ఆధ్వర్యంలో ఉద్యోగ విరమణ సన్మాన మహోత్సవం   •   విద్యుత్ ప్రమాద బీమా చెక్కును అందించిన తుమ్మల యుగంధర్   •   నేటితో ముగియనున్న కొండపైన వర్తక సంఘం లీజు గడువు   •   జనసంద్రంగా యాదగిరి క్షేత్రం   •   మహమ్మద్ జావీద్ శ్రద్ధాంజలి కార్యక్రమంలో పాల్గొన్న కాంగ్రెస్ నాయకులు   •   ఈటలకు వ్యతిరేకంగా ప్లెక్సీలు.. స్పందించిన రాంచందర్   •  

నల్ల నేలపై మెరిసిన వైష్ణవి

13-04-2026 02:21 AM

సింగరేణి కార్మికుడి కూతురు స్టేట్ సెకండ్

మంచిర్యాల, ఏప్రిల్ 12 (విజయక్రాంతి): రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన ఇంటర్ ఫలితాలలో సింగరేణి కార్మికుడి కూతురు ప్రతిభ కనబర్చి రాష్ట్ర స్థాయి ర్యాంకు సాధించింది. సింగరేణి కార్మికుడుగా మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్ ఏరియా ఆర్ కే - 5 గనిలో జనరల్ మజ్దూర్ గా విధులు నిర్వహిస్తున్న రెంకా చంద్రమౌళి కూతురు రెంకా వైష్ణవి ఇంటర్ సెకండ్ ఇయర్ బైపీసీ విభాగంలో 995 మార్కులు సాధించి రాష్ట్రస్థాయిలో రెండవ స్థానంలో, ఉమ్మడి ఆదిలాబాద్ టాపర్ గా నిలిచింది.

పదవ తరగతిలో 10 జీపీఎ సాధించి డాక్టర్ కావాలనే లక్ష్యంతో మంచిర్యాలలోని ఓ ప్రైవేటు కళాశాలలో చదువుతూ ఇంటర్‌లో రాష్ట్ర స్థాయిలో టాపర్‌గా నిలిచింది. నీట్ లో మంచి ర్యాంకు సాధించి మెడిసిన్ పూర్తి చేసి వైద్యురాలుగా స్థిరపడి సింగరేణి కార్మికులకు, పేదలకు సేవ చేయడమే లక్ష్యంగా వైష్ణవి పేర్కొంది.