13 April, 2026 | 3:33 AM

వేగవంతంగా కాళేశ్వరం బరాజ్‌ల పునరుద్ధరణ

13-04-2026 02:20 AM

ప్రత్యేకమైన స్టీరింగ్ కమిటీ ఏర్పాటు

మరమ్మతుల ప్రక్రియలో 2027, 2028 సంవత్సారాలే కీలకం

ఏఎఫ్‌ఆర్‌వై ఇండియా, ఐఐటీ ముంబైలకు కొత్త డిజైన్ల బాధ్యత

వారం రోజుల్లో డిజైన్లు పూర్తిచేయాలి

పునరుద్ధరణలో సీడబ్లూపీఆర్‌ఎస్‌కు అత్యధిక ప్రాధాన్యం

మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి

హైదరాబాద్, ఏప్రిల్ 12 (విజయక్రాంతి): కాళేశ్వరం ఎత్తిపోతల పథకం ప్రాజెక్టు పరిధిలోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల పునరుద్ధరణ పనులను వేగవంతంగా పూర్తిచేయాలని రాష్ట్ర నీటిపారు దల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. పునరుద్ధరణ పనులు వేగవంతం చేసేందుకు గానూ నీటిపారుదల రంగ నిపుణులు కల్నల్ పరిక్షిత్ మెహ్రా కన్వీనర్‌గా ఉన్నత స్థాయి స్టీరింగ్ కమిటీని తక్షణమే ఏర్పాటు చేయాలని ఆయన అధికారులకు సూచించారు. ఈ కమిటీ వారానికి రెండుసార్లు సమావేశమై ఎప్పటికప్పుడు పనుల పురోగతిని సమీక్షలు నిర్వహిస్తుందన్నారు.

అవసరమైతే స్వయంగా తాను ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా సమావేశాల్లో పాల్గొని పురోగతిని సమీక్షించ నున్నట్టు ఆయన తెలిపారు. అంతేగాకుం డా ప్రతిరోజూ పురోగతిని పర్యవేక్షించేందుకు ప్రత్యేక అధికారి నియమించ నున్న ట్లు ఆయన తెలిపారు. పునరుద్ధరణ పనులు వేగవంతం చేసేందుకు సంబంధిత అధికారు లతో ఆదివారం సచివాలయంలో మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి ప్రత్యేక సమీక్ష సమావేశం నిర్వహించారు.

నీటి పారుదల శాఖ ప్రధాన కార్యదర్శి ఈ.శ్రీధర్, నీటి పారుదల శాఖ సలహాదారుడు ఆదిత్య దాస్ నాథ్, జాయింట్ సెక్రటరీ కే శ్రీనివాస్, టన్నెల్ నిపుణులు పరిక్షిత్ మెహ్రా, ఈఎన్సీలు రమే ష్ బాబు, శ్రీనివాస్‌లతో పాటు సీడబ్ల్యూపీఆర్‌ఎస్ అదనపు డైరెక్టర్ సెల్వా బాలన్ తదితరులు సమావేశంలో పాల్గొన్నారు. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ(ఎన్డీఎస్‌ఏ), విజిలెన్స్ కమిషన్ వంటి చట్టబద్ధ సంస్థలు ఇప్పటికే మూడు బ్యారేజీల ఫౌండేషన్, డిజై న్, ప్రణాళిక, అమలు అంశాల్లో తీవ్రమైన లోపాలను గుర్తించినట్లు ఆయన తెలిపారు. ఈ మూడు నిర్మాణాల్లో సమస్యలు ఒకే విధంగా ఉన్నాయన్నారు.

కేఎల్‌ఐఎస్ మరమ్మతుల పూర్తి ప్రక్రియలో 2027, 2028 సంవత్సరాలను కీలకంగా పరిగణించాలని అధికారులను మంత్రి ఆదేశించారు. నిర్దేశిత గడువులోనే అన్నారం, సుందిళ్ల పనులు పూర్తవుతాయని, అదే సమయంలో మేడిగడ్డను కొంత భాగన్నీ పూర్తిచేయగలమనే ఆశాభావాన్ని వ్యక్తంచేశారు. ఏఎఫ్‌ఆర్‌వై ఇండియా, ఐఐటీ ముంబైలకు కొత్త డిజైన్ల బాధ్యతను ప్రభుత్వం ఇప్పటికే డిజైన్ కన్సల్టెంట్‌గా ఏఎఫ్‌ఆర్‌వై ఇండియాను ఎంపిక చేసి, ఐఐటీ ముంబైతో సంయుక్తంగా పని చే యాలని నిర్ణయించిందన్నారు. డిజైన్ బృం దం రాత్రి పగలు పనిచేసి వారం రోజుల్లో పూర్తిచేయాలని ఆయన ఆదేశించారు.

డిజైన్ పనులు త్వరితగతిన పూర్తిచేయాలని, డిజైన్ సిద్ధమైన వెంటనే సెంట్రల్ వాటర్ కమిషన్(సీడబ్ల్యూసీ)కు ఆమోదం కోసం పంపాల్సి ఉంటుందని ఆయన చెప్పారు. సెక్రటరీ పరిక్షిత్ మెహ్రాతో నిరంతరం సంప్రదింపుల్లో ఉండాలని, ఎలాంటి సమస్యలు ఉన్నా నేరు గా తన దృష్టికి తీసుకురావాలని కన్సల్టెంట్లకు సూచించారు. డిజైన్ ప్రక్రియకు సం బంధించిన భూ భౌతిక, భూ సాంకేతిక, మట్టి, హైడ్రాలిక్ మోడలింగ్ వంటి అన్ని అధ్యయనాలు సమగ్రంగా నిర్వహిస్తున్నట్టు తెలిపారు. అవసరమైన అన్ని పరీక్షలు, డేటా అత్యవసర ప్రాధాన్యంతో పూర్తి చేయాలని ఆయన ఆదేశించారు. 

సీడబ్లూపీఆర్‌ఎస్‌కు ప్రాధాన్యం.. 

పుణెలోని కేంద్ర జల, విద్యుత్ పరిశోధనా సంస్థ(సీడబ్ల్యూపీఆర్‌ఎస్) ఈ పరీక్షలు, అధ్యయనాల బాధ్యత వహిస్తున్న కేంద్ర ప్ర భుత్వ సంస్థ కాలేశ్వరం బ్యారేజీల పునరుద్ధరణ పనులను అత్యున్నత ప్రాధాన్యంగా పరి గణించాలన్నారు. ప్రభుత్వ సలహాదారు ఆదిత్యనాథ్ దాస్, కేంద్ర జల కమిషన్‌తో సమ న్వయం చేసి అవసరమైన అనుమతులు పొందాలని ఆయన సూచించారు. సీడబ్ల్యూపీఆర్‌ఎస్ సిబ్బంది 45 రోజుల పరీక్షల కాలంలో నిరంతరం ప్రాజెక్ట్ స్థలాల్లో ఉండాలని ఆదేశించారు. ఎల్ అండ్ టీ సహా అమ లు సంస్థలు తమ క్యాంపులు, మెస్ సదుపాయాలు, లాజిస్టిక్స్‌ను తక్షణమే పునరుద్ధరిం చాలని చెప్పారు.

ఇంజినీర్లు, టెక్నీషియన్లు, రిగ్ ఆపరేటర్లకు వసతి, ఆహార సమస్యలు రాకుండా చూడాలని సూచించారు. ఇసుక తొలగింపు, జీపీఆర్(భూభౌతిక) పరీక్షలు, సైట్ సిద్ధం చేసే పనులు అన్ని ఏజెన్సీల పూర్తి సహకారంతో నిర్వహించనున్నట్టు పే ర్కొన్నారు. డిజైనర్లు, సీడబ్ల్యూపీఆర్‌ఎస్, శాఖ ఇంజినీర్లు, ఏజెన్సీ ప్రతినిధులు కలిసి అన్ని పరీక్షలను ప్రత్యక్షంగా వీక్షించాలని, ప్రతి అంశాన్ని సక్రమంగా నమోదు చేయాలని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధికారుల కు స్పష్టమైన ఆదేశాలు జారీచేశారు.