తండ్రి గెలుపు కోసం కుమార్తెల ప్రచారం
03-05-2024 01:49 AM
కరీంనగర్, మే 2 (విజయక్రాంతి): కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి వెలిచాల రాజేందర్‌రావు గెలుపు కోసం ఆయన కుమార్తెలు రచన, రితిక, స్నేహా ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు. కరీంనగర్‌లో ఇంటింటికీ వెళ్లి కాంగ్రెస్‌ను గెలిపించాలని కోరుతున్నారు. గురువారం చైతన్యపురిలోని మహాశక్తి ఆలయంలో పూజలు చేసి తర్వాత ప్రచారంలో పాల్గొన్నారు. వారి వెంట సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్‌రెడ్డి, నాయకులు మామిడి సత్యనారాయణ రెడ్డి, గుండాటి శ్రీనివాస్ రెడ్డి, అమరేందర్‌రావు, మహేందర్‌రెడ్డి, వెన్నం రజిత, శిరీష్, బషీర్ ఉన్నారు.




