18 March, 2026 | 3:26 AM

రెనోవా ఎన్‌ఐజీఎల్ హాస్పిటల్స్‌లో దావత్ ఎ ఇఫ్తార్

18-03-2026 12:11 AM

ముఖ్య అతిథిగా జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే నవీన్‌యాదవ్ హాజరు

బంజారాహిల్స్, మార్చి 17(విజయక్రాం తి): రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకొని రెనోవా గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ పెద్దిరెడ్డి శ్రీధర్ ఆధ్వర్యంలో బంజారాహిల్స్ రోడ్ నం.12లోని రెనోవా ఎన్‌ఐజిఎల్ హాస్పిటల్స్‌లో దావత్-ఎ-ఇఫ్తార్ విందు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే నవీన్ యాదవ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మత పెద్దలతో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించిన అనంతరం ముస్లిం సోదరులు ఉపవాస దీక్ష ను విరమించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే నవీన్ యాదవ్ మాట్లాడుతూ, రంజాన్ మాసం సందర్భంగా ముస్లిం సోదరులకు ఇఫ్తార్ విందు ఏర్పాటు చేయడం అభినందనీయమని తెలిపారు.ఈ పర్వదినం మనుషుల మధ్య ప్రేమ, పరస్పర గౌరవాన్ని పెంచే ప్రత్యే క సందర్భమని చెప్పారు. ముందస్తుగా ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు.రెనోవా గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్ చైర్మ న్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ పెద్దిరెడ్డి శ్రీధర్ మాట్లాడుతూ, రంజాన్ నెల పరస్పర ప్రేమ, సౌహార్దం, సేవా భావాన్ని పెంపొందించే పవిత్రమైన కాలమని తెలిపారు.

సమాజంలోని అన్ని వర్గాల ప్రజలు ఐక్యంగా, పరస్పర గౌరవంతో ముందుకు సాగాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథులను డాక్టర్ ఆర్‌వీ రాఘవేంద్ర రావు, డైరెక్టర్, రెనోవా ఎన్‌ఐజిఎల్ హాస్పిటల్స్ అం డ్ సీనియర్ లివర్ ట్రాన్స్‌ప్లాంట్ సర్జన్ శాలువాలతో ఘనంగా సన్మానించారు.

ఈ కార్యక్ర మంలో డాక్టర్ ఆర్‌వీ రాఘవేంద్ర రావు, డైరెక్టర్, రెనోవా ఎన్‌ఐజీఎల్ హాస్పిటల్స్ అండ్ సీనియర్ లివర్ ట్రాన్స్ ప్లాంట్ సర్జన్, డాక్టర్ రాకేష్ శర్మ, డైరెక్టర్, రెనోవా ఎన్‌ఐజీఎల్ హాస్పిటల్స్, డాక్టర్ రాధాకృష్ణ రావు సాగి, సీఈఓ, రెనోవా మిడ్ లెవల్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్, రవీంద్రనాథ్ గరగ, సీఓఓ, రెనో వా గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్, జహీర్, వైస్ ప్రెసిడెంట్- బిజినెస్ డెవలప్ మెంట్,  రామసుబ్బా రెడ్డి కొమ్మన, సెంటర్ హెడ్, రెనోవా ఎన్ ఐజీఎల్ హాస్పిటల్స్, ముస్లిం సోదరులు, వైద్యు లు, అడ్మినిస్ట్రేటివ్ సిబ్బంది పాల్గొన్నారు.