18 March, 2026 | 1:56 AM

జీపీ కార్మికుల అరెస్టు అన్యాయం

18-03-2026 12:11 AM

గరిడేపల్లి, మార్చి 17 : ఎన్నికల ముందు జీపీ కార్మికులకు కనీస వేతనం రూ.18,000 అమలు చేస్తామని హామీ ఇచ్చిన ప్రభుత్వం, రెండు సంవత్సరాలు గడిచినా అమలు చేయకపోవడం అన్యాయమని సీఐటీయూ జిల్లా నాయకుడు షేక్ యాకోబ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కనీస వేతనంతో పాటు మల్టీపర్పస్ విధానాన్ని రద్దు చేయాలని డిమాం డ్ చేస్తూ మంగళవారం చలో సెక్రటేరియట్ కు వెళ్లుతున్న గ్రామ పంచాయతీ కార్మికులను పోలీసులు అరెస్టు చేయడానికి ఆయన తీవ్రంగా ఖండించారు.ఈ కార్యక్రమంలో గొపగాని సత్యనారాయణ,నర్సిరెడ్డి,రావుల వెంకన్న,బొంత వెంకట్ రెడ్డి,సైదులు తదితరులు పాల్గొన్నారు.