calender_icon.png 18 December, 2025 | 4:53 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

భయపెట్టే జిన్

18-12-2025 01:18:57 AM

సాదలమ్మ ఫిల్మ్ ప్రొడక్షన్స్, బిల్వ స్టూడియోస్ బ్యానర్లపై నిఖిల్ ఎం గౌడ నిర్మించిన చిత్రం ‘జిన్’. ఈ సినిమాలో అమ్మిత్ రావ్, పర్వేజ్ సింబా, ప్రకాశ్ తుమినాద్, రవి భట్, సంగీత ముఖ్యపాత్రల్ని పోషించారు. చిన్మయ్ రామ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం డిసెంబర్ 19న రిలీజ్ కాబోతోంది. ఈ సందర్భంగా నిర్మాత నిఖిల్ ఎం గౌడ మీడియాతో చిత్ర విశేషాల్ని పంచుకున్నారు.

“నాకు సినిమాల మీదున్న ప్యాషన్, ఇష్టం తెలుసుకుని చిన్మయ్ రామ్ ఈ ‘జిన్’ కథ గురించి చెప్పారు. కాన్సెప్ట్ కొత్తగా ఉందని నిర్మించేందుకు ముందుకు వచ్చా. కథ విన్నప్పుడు ఏమైతే ఊహించుకున్నానో తెరపైనా అదే ఫీలింగ్ కలిగింది. అందరినీ భయపెట్టేలా ఉంటుందీ సినిమా. మామూలుగా ఈ కాన్సెప్ట్ చాలా మందికి తెలియదు. ఈ సినిమాలో కొత్త ప్రపంచాన్ని చూపించబోతోన్నాం. ప్రస్తుతం కొన్ని కథలు చర్చల దశల్లోనే ఉన్నాయి. ఇకపై కన్నడ, తెలుగు భాషల్లో సినిమాల్ని నిర్మిస్తుంటా” అన్నారు.