ఏఐసీసీ ఇన్చార్జ్ మీనాక్షి నటరాజ్ చేతుల మీదుగా నియామక పత్రం అందుకున్న డీసీసీ అధ్యక్షురాలు దేవి ప్రసన్న
కొత్తగూడెం, డిసెంబర్ 4,( విజయక్రాంతి): జిల్లాలో కాంగ్రెస్ను మరింత బలో పేతం చేసే దిశగా అందరితో కలిసి ,కృషి చేస్తానని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కాంగ్రె స్ పార్టీ అధ్యక్షురాలు తోట దేవిప్రసన్న అ న్నారు. టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ అధ్యక్షతన నిర్వహించిన కార్యవర్గ స మావేశంలో సీఎం రేవంత్ రెడ్డి, ఏఐసీసీ ఇం ఛార్జ్ మీనాక్షీ నటరాజన్ తదితర నేతలు ఈ సమావేశంలో పాల్గొన్నారు.
ఈ సమావేశంలో నూతనంగా నియమితులైన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా డీసీసీ అధ్యక్షురాలు తోట దేవిప్రసన్న కు పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్, ఏ ఐసీసీ ఇంఛార్జ్ మీనాక్షీ నటరాజన్ లు నియమక పత్రాన్ని అందజేశారు. ఈ సందర్బంగా దేవిప్రసన్న మాట్లాడుతు ,రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలు, పార్టీ బలోపేతం, ఏఐసీసీ కార్యక్రమాల అమలు, రాష్ట్రవ్యాప్త కాంగ్రెస్ కార్యక్రమాలు తదితర కీలక అంశాలపై విస్తృత చర్చ చేసినట్టు తెలిపారు.
ఎన్నికల తర్వాత కాంగ్రెస్ పార్టీని గ్రామ-మండల స్థా యిలో మరింత బలపరుచుకునే ప్రణాళికల ను ,ఈ సమావేశంలో ఖరారు చేసినట్టు తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయిలో కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేసే దిశగా కార్యక్రమాలు రూపొందిం చబోతున్నట్లు ఆమె తెలిపారు.




