04-12-2025 11:15:10 PM
పాస్టర్ పాల్ కిషోర్..
మహబూబ్ నగర్ (విజయక్రాంతి): మానవాళి కోసం 2 వేల సంవత్సరాల క్రితం ఈ లోకానికి వచ్చిన యేసు క్రీస్తు ప్రభువును ఆరాధించడమే క్రిస్మస్ పండుగని పాస్టర్ పాల్ కిషోర్ అన్నారు. పాస్టర్స్ ఫెలోషిప్ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని ప్రభుత్వం బాలురు కళాశాల మైదానంలో నిర్వహించిన గ్రాండ్ క్రిస్మస్ వేడుకలు రెండో రోజు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ పాపములో కూరుకుపోయిన వారిని వెతికి రక్షించేందుకు ఆయన ఈ లోకానికి వచ్చాడన్నారు. మనకు శాంతి సమాధానం నెమ్మది దయచేసి నా గొప్ప దేవుడు యేసు క్రీస్తు ప్రభువు అని ఆయన అభివర్ణించారు.
ఈ క్రిస్మస్ వేళలో ఆయన ప్రేమను చాటివారంగా మనమంతా ఉండాలని ఆయన పిలుపునిచ్చారు. అనంతరం క్రిస్మస్ స్కిట్స్ కొరియోగ్రఫీ లతో చిన్నారులు ఆకట్టుకున్నారు. రేపు జాన్ వెస్లీ రాక.. గ్రాండ్ క్రిస్మస్ వేడుకల్లో భాగంగా చివరి రోజైనా శుక్రవారం హోసన్న మినిస్ట్రీస్ నిర్వాహకులు పాస్టర్ జాన్ వెస్లీ హాజరై క్రిస్మస్ సందేశాన్ని అందించనున్నారని చైర్మన్ పాస్టర్ జైపాల్ తెలిపారు. ఈ కార్యక్రమంలో కార్యదర్శి పాస్టర్ అమర్, కోశాధికారి పాస్టర్ జాన్ పాస్టర్లు ప్రసాద్ బాబు రవిలతో పాటు అధిక సంఖ్యలో విశ్వాసులు తదితరులు పాల్గొన్నారు.