14 April, 2026 | 1:40 PM

కుమితేలో వెండి, కటాలో కాంస్యం

05-12-2025 12:00 AM

జాతీయ కరాటే పోటీల్లో కోటా కాలేజీ విద్యార్థిని రిషిక సత్తా

కరీంనగర్, డిసెంబర్ 4: ఏపీలోని విశాఖపట్నం రాజీవ్ ఇండోర్ స్టేడియంలో నవంబర్ 27 నుంచి 30 వరకు ఒకినావా మార్షల్ ఆర్ట్స్ అకాడమీ ఆధ్వర్యంలో నిర్వహించిన జాతీయ స్థాయి కరాటే పోటీల్లో కరీంనగర్ కోటా కాలేజీ విద్యార్థిని కె రిషిక ప్రతిభను చూపింది. జూనియర్స్ 16-18 ఏళ్ల విభాగంలోని కుమితే (ఫైట్) స్పర్థలో ద్వితీయ స్థానం సాధించి వెండి పతకం గెలుచుకోగా, కటా విభాగంలో కాంస్య పతకాన్ని సొంతం చేసుకుంది.

రిషిక ప్రదర్శనపై కాలేజ్ నిర్వాహకులు, అధ్యాపకులు సంతోషం వ్యక్తం చేశారు. గురువారం నిర్వహించిన ప్రత్యేక అభినందన కార్యక్రమంలో కోటా జూనియర్ కళాశాలల చైర్మన్ డాక్టర్ డి అంజిరెడ్డి రిషికను అభినందించారు. జాతీయ స్థాయి వేదికపై మా విద్యార్థిని రిషిక ఇంత కీలకమైన విజయాన్ని సాధించడం ఎంతో గర్వకారణం అన్నారు.