30 August, 2026 | 8:32 PM

Breaking News

ఇందిరమ్మ గృహ లబ్ధిదారులకు నూతన వస్త్రాలు అందజేత   •   సత్యనారాయణ గౌడ్‌ను పరామర్శించిన మంథని బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు   •   జెండాపై కవిరాజు పుస్తకావిష్కరణ   •   గరిడేపల్లి బస్టాండ్ లో మహిళలకు కనీస వసతులను ఏర్పాటు చేయాలి   •   ఎన్నికలు ఎప్పుడు వచ్చిన టిఆర్ఎస్ గెలుపుకాయం   •   కొండ పోచమ్మ ఆలయంకు సీసీ కెమెరా వితరణ   •   గిరిజన విద్యార్థి సంఘం నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడిగా జాదవ్ ప్రవీణ్ నాయక్   •   ఇందిరమ్మ ఇండ్లను ప్రారంభించిన ఎమ్మెల్యే విజయరమణ రావు   •   పాదయాత్రికుల దాహం తీర్చిన పిఎఆర్ టీమ్   •   కాంగ్రెస్ వెయ్యి రోజుల పాలన వైఫల్యమే లక్ష్యంగా బీఆర్ఎస్ పోరుబాట   •  

గిరిజన విద్యార్థి సంఘం నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడిగా జాదవ్ ప్రవీణ్ నాయక్

30-08-2026 08:00 PM

బోధన్,ఆగస్టు 30(విజయ క్రాంతి): గిరిజన విద్యార్థి సంఘం (జీవీఎస్) నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడిగా జాదవ్ ప్రవీణ్ నాయక్ రెండోసారి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. హైదరాబాద్‌లో నిర్వహించిన గిరిజన విద్యార్థి సంఘం ముఖ్య నాయకుల సమావేశంలో నూతన జాతీయ, రాష్ట్ర, జిల్లా కమిటీలను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడిగా జాదవ్ ప్రవీణ్ నాయక్‌ను, జిల్లా ప్రధాన కార్యదర్శిగా కొర్ర బంతిలాల్ నాయక్‌ను, జిల్లా ఉపాధ్యక్షుడిగా బర్మావత్ నరేష్ నాయక్‌ను రాష్ట్ర కమిటీ ఏకగ్రీవంగా ఎన్నుకుంది.

కార్యక్రమంలో గిరిజన విద్యార్థి సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు ధారావత్ గణేష్ నాయక్, జాతీయ అధ్యక్షుడు వెంకట్ బంజారా, జాతీయ నాయకులు ఇందల్ రాథోడ్, రాష్ట్ర అధ్యక్షుడు మూడ్ బాలాజీ నాయక్, జీవీఎస్ నాయకులు రవీందర్ నాయక్, వడిత్య రమేష్ నాయక్, రాజ్ కుమార్ నాయక్, బాలాజీ నాయక్, డాన్ శీను నాయక్‌తో పాటు వివిధ జిల్లాల అధ్యక్షులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ గిరిజన విద్యార్థుల హక్కుల పరిరక్షణతో పాటు బంజారా సమాజం అభివృద్ధి కోసం గిరిజన విద్యార్థి సంఘం నిరంతరం పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. విద్యార్థులు విద్య, ఉద్యోగ రంగాల్లో ముందుకు వెళ్లేందుకు అవసరమైన సహకారం అందించడంతో పాటు సామాజిక సమస్యల పరిష్కారానికి సంఘం కృషి చేయాలని సూచించారు. 

రాష్ట్ర అధ్యక్షుడు మూడ్ బాలాజీ నాయక్ మాట్లాడుతూ సంఘంలోని నాయకులు సమన్వయంతో, ఐక్యంగా పనిచేస్తూ గిరిజనుల సంక్షేమం, విద్యార్థుల హక్కులు, జాతి అభివృద్ధి కోసం కృషి చేయాలని అన్నారు. నూతనంగా ఎన్నికైన జిల్లా కమిటీ సభ్యులకు పలువురు నాయకులు అభినందనలు తెలిపారు.