కొండ పోచమ్మ ఆలయంకు సీసీ కెమెరా వితరణ
30-08-2026 08:03 PM
బోయినపల్లి: ఆగస్టు 30( విజయక్రాంతి): రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం కోరేం గ్రామానికి చెందిన రోమాల నరేష్ అశ్విని దంపతులు స్థానిక కొండ పోచమ్మ ఆలయం కు సీసీ కెమెరా వితరణ చేశారు. ఆదివారం ప్రదాన ఆలయం ముందు సీసీ కెమెరా బిగించారు. ఈ దంపతులు మొక్కు కింద సీసీ కెమెరా అందించారు. వీరికి అక్షయ్ రామ్, కూతురు వినయ్ శ్రీ, కుమారుడు విరాజ్ ఉన్నారు. సి సి కెమెరా ప్రారంభోత్సవ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ నాయకులు వన్నెల రమణారెడ్డి, డైరెక్టర్ మల్లారెడ్డి, నాయకులు పులి హనుమాన్లు, నేరెళ్ల ఆంజనేయులు ఉన్నారు.






