30 August, 2026 | 8:39 PM

Breaking News

ఇందిరమ్మ గృహ లబ్ధిదారులకు నూతన వస్త్రాలు అందజేత   •   సత్యనారాయణ గౌడ్‌ను పరామర్శించిన మంథని బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు   •   జెండాపై కవిరాజు పుస్తకావిష్కరణ   •   గరిడేపల్లి బస్టాండ్ లో మహిళలకు కనీస వసతులను ఏర్పాటు చేయాలి   •   ఎన్నికలు ఎప్పుడు వచ్చిన టిఆర్ఎస్ గెలుపుకాయం   •   కొండ పోచమ్మ ఆలయంకు సీసీ కెమెరా వితరణ   •   గిరిజన విద్యార్థి సంఘం నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడిగా జాదవ్ ప్రవీణ్ నాయక్   •   ఇందిరమ్మ ఇండ్లను ప్రారంభించిన ఎమ్మెల్యే విజయరమణ రావు   •   పాదయాత్రికుల దాహం తీర్చిన పిఎఆర్ టీమ్   •   కాంగ్రెస్ వెయ్యి రోజుల పాలన వైఫల్యమే లక్ష్యంగా బీఆర్ఎస్ పోరుబాట   •  

ఎన్నికలు ఎప్పుడు వచ్చిన టిఆర్ఎస్ గెలుపుకాయం

30-08-2026 08:06 PM

పేదలకు భారం కావద్దనే పాంచజన్య పథకాల హామీ 

హామీలు నెరవేర్చని ప్రభుత్వాలను గద్దె దించాలి 

సదాశివనగర్ మండల కేంద్రం లో టిఆర్ఎస్ లో భారీగా చేరికలు 

టిఆర్ఎస్ ఎల్లారెడ్డి నియోజకవర్గ ఇంచార్జ్  ఎదురు గట్ల సంపత్ గౌడ్

సదాశివనగర్, ఆగస్టు 30 (విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికలు ఎప్పుడు వచ్చినా టిఆర్ఎస్ గెలుపు ఖాయమని ఎల్లారెడ్డి నియోజకవర్గం ఇంచార్జ్ ఎదురు గట్ల సంపత్ గౌడ్ అన్నారు. ఆదివారం కామారెడ్డి జిల్లా  సదాశివనగర్ మండలం అడ్లూర్ ఎల్లారెడ్డి, అమర్ల బండ, తుక్కోజి వాడి గ్రామాలకు చెందిన  50 మంది కాంగ్రెస్, బిఆర్ఎస్ పార్టీల, బీజేపీ పార్టీ లకు రాజీనామా చేసి ఎల్లారెడ్డి నియోజకవర్గ ఇన్చార్జ్  ఎదురుగట్ల సంపత్ గౌడ్ ఆధ్వర్యంలో టిఆర్ఎస్ పార్టీ  లో చేరారు. ఈ సందర్భంగా వారికి పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

అనంతరం ఎల్లారెడ్డి నియోజకవర్గం ఇంచార్జ్  ఎదురుగట్ల సంపత్ గౌడ్ మాట్లాడుతూ.. సామాజిక న్యాయం, బడుగు బలహీన వర్గాల అభివృద్ధి, పేదల సంక్షేమమే  టిఆర్ఎస్ పార్టీ లక్ష్యమన్నారు. ప్రతి ఒక్కరికి ఉచిత వైద్యం, ఉచిత విద్య అందించాలనే లక్ష్యంతో  తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవితక్క కంకణం కట్టుకున్నారన్నారు. యువతకు ఉపాధి కల్పించేందుకు ఉపాధి పథకం , రైతుల అభివృద్ధి గేయంగా వ్యవసాయ పథకం, సామాజిక న్యాయమే లక్ష్యంగా సమాజంలోని సబ్బండ వర్గాలకు న్యాయం చేయాలని కవితక్క కంకణం కట్టుకున్నారన్నారు.  పాంచజన్య పథకాలతో టి ఆర్ ఎస్ ముందుకెళ్తుందన్నారు. సదాశివ నగర్ మండల కేంద్రంలో పార్టీని ముందుకు తీసుకెళ్తున్న  మండల అధ్యక్షుడు సాయ గౌడ్ ని  ఈ సందర్భంగా అభినందించారు.

పార్టీలో చేరికలు 

సదాశివనగర్ మండలం  అడ్లూర్ ఎల్లారెడ్డి గ్రామానికి చెందిన ఉప్పల్ వాయి సంధ్య, తండా స్వామి, చాకలి స్వామి, చాకలి సౌందర్య, చాకలి రాజవ్వ, డంగు వెంకటి, అస లింగం, మధు,  రమేష్, రాజు, అమర్ల బండ కు చెందిన వార్డు మెంబర్ గుండెల్లి జీవిత, పరిధిపేట గోదావరి,  పరిధిపేట రావణ్, గుండెల్లి సాయి కుమార్,తుక్కోజీ వాడి గ్రామానికి చెందిన  జెర్రి పోతుల రాజవ్వ, రజిత, లత, మ్యాదరి భాస్కర్, జర్రి పోతుల లింగం, రాజయ్య, జెర్రి పోతుల గంగా సాయిలు, కడ్తాల నవీన్,  గైని చింటూ లు పార్టీ లో చేరారు. ఈ కార్యక్రమం లో మండల అధ్యక్షుడు సాయ గౌడ్, సోషల్ మీడియా ఇంచార్జి మోసర్ల శ్రీకాంత్ రెడ్డి, చాకలి లింగం, సాయిలు, రాజయ్య, కడ్తాలా నవీన్, గ్రామ అధ్యక్షుడు కడ్తాలా రాజు,అరగొండ రవి, పాల్గొన్నారు.