21-02-2026 10:21:41 AM
లచ్చి రామ్ నాయక్ సీరియస్ తో సూర్యాపేటకు తరలింపు.
హెచ్చరిక బోర్డు లేకుండా కాంట్రాక్టర్ పనులు చేస్తున్న వైనం
తుంగతుర్తి,(విజయక్రాంతి): సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండల కేంద్రంలో రోడ్డు వెడల్పు కార్యక్రమంలో భాగంగా పనులు నిర్వర్తిస్తున్న సృజన కాంట్రాక్టర్ నిర్లక్ష్యంతో శుక్రవారం రాత్రి 8 గంటలకు బైక్ పై వస్తున్న వ్యక్తులకు హెచ్చరిక బోర్డులు లేకపోవడంతో కాంట్రాక్టర్ తీస్తున్న గుంతల రాళ్ళకు బైకు తగిలి ప్రమాదం చోటుచేసుకున్న సంఘటన చోటుచేసుకుంది. స్థానికులు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం రామన్నగూడెం గ్రామానికి చెందిన లచ్చి రామ్ నాయక్ తలకు బలమైన గాయాలు కాగా అంబులెన్స్లో సూర్యాపేట ఏరియా దావకానకు తరలించారు. సన్నాయి శ్రీనుకు గాయం కావడంతో తుంగతుర్తి ప్రభుత్వ దావకానలో చికిత్స చేసి, ఇంటికి పంపించారు. లచ్చి రామ్ నాయక్ తలకు బలమైన గాయం కావడానికి కారణం కాంట్రాక్టర్ నిర్లక్ష్యంతోనే జరిగిందని స్థానికులు తెలుపుతున్నారు. జరిగిన సంఘటనపై పోలీసులు పూర్తి విచారణ జరిపి, పనుల్లో నిర్లక్ష్యం వహిస్తున్న కాంట్రాక్టర్ పై జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీ చర్యలు తీసుకోవాలని స్థానికులు, కుటుంబ సభ్యులు కోరుతున్నారు.