17 June, 2026 | 10:13 PM

ఆలయంలో ప్రత్యేక పూజలు జరిపిన డీసీపీ

05-08-2025 09:37 PM

జాజిరెడ్డిగూడెం: జాజిరెడ్డిగూడెం మండల పరిధిలోని కోమటిపల్లి గ్రామంలో గ్రామవాసి మంచిర్యాల డీసీపీ(డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్) ఎగ్గడి భాస్కర్-మాలిని దంపతులు శ్రావణమాసం సందర్భంగా మంగళవారం గ్రామంలోని శ్రీ ఆంజనేయస్వామి దేవాలయం, బొడ్రాయికి ప్రత్యేక పూజలు జరిపారు. ఈ సందర్భంగా గ్రామస్తులు ఐపీఎస్ అధికారికి సాధన స్వాగతం పలికి శాలువాలతో సత్కరించారు. అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు.