06-08-2025 12:37:17 PM
తుంగతుర్తి (విజయ క్రాంతి): గడిచిన 40 సంవత్సరాలుగా సూర్యాపేట జిల్లా(Suryapet District) తుంగతుర్తి మండల కేంద్రంలోని ఎస్సీ కాలనీలో తడకమల్ల అచ్చమల్లు , రేణుక కుటుంబ సభ్యులు గుడిసెలో జీవనం సాగిస్తున్నారు. గత ప్రభుత్వ పాలకులు డబుల్ బెడ్ రూమ్ ఇస్తామని మాయమాటలు చెబుతూ, రెండు పర్యాయాలు ఓట్లు వేయగా, గెలిచిన అనంతరం మా ముఖము కూడా చూడలేదని, కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం కాంగ్రెస్ ప్రజాపాలనలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(Chief Minister Revanth Reddy), బడుగు బలహీన వర్గాల ప్రజలకు, ఇందిరమ్మ ఇల్లు కేటాయించాలని, నియోజకవర్గానికి 3500 చొప్పున పంపిణీకి, పథకానికి శ్రీకారం చుట్టారు.
తుంగతుర్తి లో కాంగ్రెస్ ఇందిరమ్మ కమిటీ సభ్యులు అధికారులు వచ్చి పేర్లు రాసుకొని వెళ్లారు. అనంతరం ఇల్లు వచ్చిందా అని అనుకుంటే, కొందరు వచ్చిందని మరికొందరు ఎల్వన్ ,ఎల్ టు, ఎల్ త్రీ లో మీ పేరు పడిందని చెప్పారు. గ్రామపంచాయతీ అధికారులు, సిబ్బంది పూర్తి నిర్లక్ష్యంతో ఖాళీ ప్లేస్ లో తీసిన ఫోటోలకు బిల్డింగ్ ఉన్నట్లు చెప్పడం ఏందని ప్రశ్నిస్తున్నారు, మా పేరు ఆన్లైన్ కాలేదని కుటుంబ సభ్యులు ఏకంగా దండం పెడుతూ ...మాకు తప్పనిసరిగా ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయాలని జిల్లా కలెక్టర్, స్థానిక ఎమ్మెల్యే మందుల సామేలును ప్రార్థిస్తున్నారు.