06-08-2025 12:40:12 PM
బిఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులు తాటికొండ సీతయ్య
తుంగతుర్తి,(విజయక్రాంతి): తెలంగాణ స్వరాష్ట్ర సాధన కోసం జీవితాన్ని అర్పించిన మహోన్నత వ్యక్తి ఆచార్య కొత్తపల్లి జయశంకర్ సార్. తుంగతుర్తి పార్టీ కార్యాలయం లో వారిజయంతి(Jayashankar jayanthi) సందర్బంగా చిత్రపటానికి పూలమాలవేసి నివాళి అర్పించిన బిఆర్ఎస్ పార్టీ శ్రేణులు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి తాటికొండ సీతయ్య మాట్లాడుతూ 1936ఆగస్టు 6న జన్మిచిన జయశంకర్ సార్ 1956లోనే తెలంగాణ స్వరాష్ట్ర ఆవశ్య కతను గుర్తించి ఉద్యమం వైపు ఆకర్షితు లై. సిద్దాంతాన్ని రూపుందించి తెలంగాణ సమాజానికి అందించి మలివిడత పోరాటానికి కెసిఆర్ కలిసి రాష్ట్ర సాధన లో 2011జూన్ 21న పరమాపదించారని తెలియ చేశారు. ఆయన ఆశయాలు సాధించుటకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమం లో మండల నాయకులు గుండగాని దుర్గయ్య, గోపగాని రమేష్, తడకమళ్ల రవికుమార్, గోపగాని వెంకన్న సోమేశ్,.లతీబ్, నల్లబెల్లి వెంకన్న, అశోక్, మల్లికార్జున్, మల్లేష్, మధు, సాయికిరణ్ తదితరులు పాల్గొన్నారు