06-08-2025 11:53:26 AM
ఎంపీడీవో ఆఫీసులో ఖాళీ కుర్చీల దర్శనం
అధికారుల నిర్లక్ష్యంతో ప్రజల ఇక్కట్లు
సంస్థాన్ నారాయణపూర్,(విజయక్రాంతి): సంస్థాన్ నారాయణపురం మండలంలో(Samsthan Narayanpur Mandal) ప్రభుత్వ అధికారుల నిర్లక్ష్యంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు.ఎంపీడీవో కార్యాలయంలో బుధవారం ఉదయం 11:30 అయినప్పటికీ ఖాళీ కుర్చీలు దర్శనం ఇచ్చాయి.దీంతో అధికారుల రాక కోసం ప్రజలు ఎదురుచూసి తీవ్ర ఇబ్బందికి గురయ్యారు. ప్రభుత్వం సమయ పాలన పాటించని అధికారులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తున్నా అధికారులు మాత్రం పట్టించుకోవడం లేదు. దీంతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు.ఇప్పటికైనా అధికారులు సమయానికి వచ్చేలా చూడాలని ప్రజలు కోరుతున్నారు.ఉదయం నుండి అధికారులు ఎవరు రాలేదని ప్రజలు చెబుతుంటే ఇప్పుడే ఆఫీసు పని మీద బయటకు వెళ్లారని కార్యాలయ సిబ్బంది చెప్పడం గమనార్హం.