calender_icon.png 6 August, 2025 | 2:57 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఈడీ విచారణకు హాజరైన విజయ్ దేవరకొండ

06-08-2025 12:19:04 PM

హైదరాబాద్: అక్రమ బెట్టింగ్ యాప్‌ల కేసుకు సంబంధించి ప్రముఖ సినీ నటుడు విజయ్ దేవరకొండ(Vijay Deverakonda) బుధవారం ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (Enforcement Directorate) ముందు హాజరయ్యారు. బెట్టింగ్ యాప్‌ల ప్రమోషన్‌కు సంబంధించిన కేసులో విజయ్ దేవరకొండకు జారీ అయిన సమన్లకు ప్రతిస్పందిస్తూ, బషీర్‌బాగ్‌లోని ఈడీ కార్యాలయంలో విజయ్ దేవరకొండ హాజరయ్యారు. విచారణ సమయంలో ఈడీ అధికారులు సినీ నటుడి ఆర్థిక లావాదేవీలు, బ్యాంక్ వివరాల గురించి ప్రశ్నించనున్నారు. అక్రమ బెట్టింగ్ యాప్‌లను ప్రోత్సహించినందుకు ఈడీ కేసు నమోదు చేసిన 29 మంది ప్రముఖులలో ఆయన కూడా ఉన్నారు.

పబ్లిక్ గ్యాంబ్లింగ్ చట్టం-1867ను ఉల్లంఘించి, అక్రమ బెట్టింగ్ ప్లాట్‌ఫామ్‌లను ప్రోత్సహించినందుకు 29 మంది నటులు, ఇన్‌ఫ్లుయెన్సర్లు, యూట్యూబర్‌లపై ప్రధాన దర్యాప్తు సంస్థ ఇప్పటికే ఎన్‌ఫోర్స్‌మెంట్ కేస్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ (Enforcement Case Information Report) దాఖలు చేసింది. తెలంగాణ పోలీసులు నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌ల ఆధారంగా మనీలాండరింగ్ నిరోధక చట్టం (PMLA) నిబంధనల కింద ఈడీ దర్యాప్తు చేపట్టింది. ఈడీ ఆఫీసుకు వెళ్తూ మీడియాతో మాట్లాడిన విజయ్ దేవరకొండ టైంపాస్ క్వశ్చన్స్ అడగొద్దంటూ లోపలికి వెళ్లారు. విచారణ తర్వాత అన్ని విషయాలు చెబుతానని విజయ్ దేవరకొండ స్పష్టం చేశారు.