calender_icon.png 6 August, 2025 | 12:00 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పాఠశాలల్లో విద్యార్థులకు కనీస అవసరాలు సమకూర్చాలి

05-08-2025 09:32:13 PM

వరంగల్ జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి యం.సాయి కుమార్

వరంగల్,(విజయక్రాంతి): ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులు ఎటువంటి అసౌకర్యాలకు గురికాకుండా చూసుకోవాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ వరంగల్ కార్యదర్శి యం.సాయికుమార్ సూచించారు. ఈ సందర్భంగా పాఠశాల తరగతి గదులను, వంటగది, స్టోర్ రూమ్, మూత్రశాల లను పరిశీలించారు. విద్యార్థులు తాము ఎదుర్కొంటున్న సమస్యలు తెలుసుకున్నారు. పలు రికార్డులను న్యాయమూర్తి తనిఖీ చేశారు.

భోజనశాలలో విద్యార్థులకు వండిన అన్నం, కూరలను పరిశీలించారు. విద్యార్థుల మెనూ ప్రకారం విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలన్నారు. పాఠశాలలో న్యాయ సేవాధికార సంస్థ ఏర్పాటుచేసిన లీగల్ లిటరసీ క్లబ్ విద్యార్థులతో ప్రత్యేకంగా మాట్లాడారు. పాఠశాల పరిసర ప్రాంతాలను, తరగతి గదులను, మూత్రశాలలను, వంటగది తదితర ప్రాంతాలను ప్రతీరోజూ శుభ్రంగా ఉంచుకోవాలని తెలిపారు. విద్యార్థినీ విద్యార్థులకు ఎటువంటి అసౌకర్యాలు కలిగిననూ, ఎటువంటి న్యాయ సలహాలకైననూ న్యాయ సేవాధికార సంస్థ టోల్ ఫ్రీ నెంబర్ 15100 లేదా 9391907362 కు తెలియజేయాలని తెలిపారు.