20 June, 2026 | 4:17 PM

Breaking News

కెరమెరిలో డయాలసిస్ కేంద్రం ఏర్పాటు చేయాలి   •   గతంలో విద్యావ్యవస్థను కేసీఆర్ పాడుచేస్తే… ప్రస్తుతం రేవంత్ సర్కార్ చంపేస్తోంది   •   పరేడ్ గ్రౌండ్స్‌లో అంతర్జాతీయ యోగా 24 గంట కౌంట్‌డౌన్ కార్యక్రమం   •   రైతు కుటుంబాన్ని పరామర్శించనున్న కేటీఆర్   •   హైదరాబాద్ రోడ్డుకి ట్రంప్ పేరు పెట్టడాన్ని నిరసిస్తూ నల్ల జెండాలతో ప్రదర్శన   •   'పది'లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు నగదు ప్రోత్సాహకం   •   జనపనార పైలెట్ ప్రాజెక్టు పై అవగాహన సదస్సు   •   23న రాష్ట్ర వ్యాప్త పాఠశాలల బంద్   •   అనురాగ్ లో 5రోజుల ఉపాధ్యాయ శిక్షణా తరగతులు ప్రారంభం   •   ఎస్‌ఐఆర్ విజయవంతానికి ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి   •  

ముగిసిన తొలివిడత పంచాయతీ నామినేషన్ల గడువు

29-11-2025 05:55 PM

హైదరాబాద్: తెలంగాణలో జరుగబోయే తొలివిడత గ్రామ పంచాయతీ ఎన్నికలకు నామినేషన్ల స్వీకరణ గడువు శనివారం ముగిసింది. నామినేషన్ల ఉపసంహరణకు డిసెంబర్ 3న తుది గడువు ముగిస్తుందని, తొలి విడతలో 4,236 గ్రామపంచాయతీలు, 37,440 వార్డుల్లో ఎన్నికలు జరుగుతాయని రాష్ట్ర ఎన్నికల అధికారులు పేర్కొన్నారు. రేపు నామినేషన్ల పరిశీలన, ఎల్లుండి అప్పీళ్ల స్వీకరణ, డిసెంబర్ 3న పోటీలో ఉన్న తుది అభ్యర్థుల జాబితాను అధికారులు వెల్లడిస్తారు. డిసెంబర్ 11న పోలీంగ్, అదేరోజు ఓట్ల లెక్కింపు, ఉపసర్పంచ్ ఎన్నిక జరుగుతుంది.

రేపట్నంచి డిసెంబర్ 2 వరకు రెండో విడత ఎన్నికలకు నామినేషన్ల స్వీకరణ, అలాగే 4,333 పంచాయతీలు, 38,350 వార్డుల్లో రెండో విడత ఎన్నికలు నిర్వహించనున్నట్లు ఎన్నికల అధికారులు తెలిపారు. డిసెంబర్ 11న మధ్యాహ్నం ఒంటిగంట వరకు తొలి విడత పోలింగ్ జరగనుంది. మధ్యాహ్నం తర్వాత ఓట్లు లెక్కించి ఫలితాలు వెల్లడిస్తారు. రెండో విడత పంచాయతీ ఎన్నికల ప్రక్రియ రేపటి నుంచి ప్రారంభం కానుంది. డిసెంబర్ 2 వరకు నామినేషన్లు స్వీకరించనున్నారు. డిసెంబర్ 6న నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగుస్తోంది. గత రెండు రోజుల్లో 4,236 సర్పంచ్ పదవులకు 8,198 నామినేషన్లు, 37,440 వార్డు కార్యాలయాలకు 11,502 నామినేషన్లు వచ్చినట్లు అధికారులు పేర్కొన్నారు.