3 July, 2026 | 9:15 PM

Breaking News

వర్షపు ఇబ్బందుల్లో ఉన్న కుటుంబానికి టార్పాలిన్ అందించిన సర్పంచ్   •   స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్ఐఆర్) 2027 కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి   •   ఆండాళ్ అమ్మవారికి ఊంజల్ సేవోత్సవం   •   పిచ్చిమొక్కల తొలగింపు   •   తాగారు.. దొరికారు..   •   కేజీబీవీ పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన మండల ప్రత్యేక అధికారి   •   ఖానాపూర్ ఆర్టీసీ బస్టాండ్ పరిశీలించిన రీజినల్ మేనేజర్   •   శ్రీ లక్ష్మి భూలక్ష్మి సమేత శీతలాదేవి విగ్రహ ప్రతిష్ఠలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి   •   అబద్ధపు హామీలకు కేరాఫ్ కాంగ్రెస్ పార్టీ   •   కస్తూర్బా గాంధీ విద్యార్థినీలకు ఏకరూప దుస్తులు, నోట్ బుక్స్ పంపిణీ   •  

ప్రాణంతీసిన చేపల వేట

30-09-2024 12:00 AM

హస్నాబాద్ చెరువులో మునిగి వ్యక్తి మృతి 

కొడంగల్, సెప్టెంబర్29 (విజయక్రాంతి): చేపల వేటకు వెళ్లిన ఓ వ్యక్తి చెరువులో మునిగి మృతి చెందిన సంఘటన కొడంగల్ మండలం గుం డ్లకుంటలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు.. గుండ్లకుం ట గ్రామానికి చెందిన మాలెల ఊశప్ప(40) స్నేహితులతో కలిసి హస్నాబాద్ చెరువులో చేపల వేటకు వెళ్లాడు.

వలలను నీటిలో వేసే క్రమం లో ఊశప్ప ప్రమాదవశాత్తు చెరువులోకి జారపడిపోగా పూడిక తీసిన పెద్దగుంత ఉండటంతో అందు లో ఇరుక్కొనిపోయాడు. అప్పటికే రాత్రి కావడంతో అతడి స్నేహితులు ఎంత వెతికినా ఊశప్ప కన్పించలేదు. ఆదివారం ఉదయం పోలీసుల సహకా రంతో చెరువులోకి దిగి వెతకగా ఊశప్ప శవం లభ్యమయ్యింది. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు  చేస్తున్నట్లు ఎస్‌ఐ సత్యానారయణ తెలిపారు.