calender_icon.png 6 December, 2024 | 5:10 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రేషన్ బియ్యం అమ్ముతున్న డీలర్ అరెస్టు

05-11-2024 08:41:05 PM

ఘట్ కేసర్,(విజయక్రాంతి): ప్రజలకు అందించాల్సిన రేషన్ బియ్యాన్ని బ్లాక్ లో అమ్ముతున్న రేషన్ డీలర్, కొనుగోలు చేసిన మరో వ్యక్తిని అరెస్టు చేసి 12 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్న సంఘటన ఘట్ కేసర్ పోలీసు స్టేషన్ పరిధిలో మంగళవారం జరిగింది. ఘట్ కేసర్ ఇన్ స్పెక్టర్ పరశురాం తెలిపిన వివరాలు... పోలీసు స్టేషన్ పరిధి బాలాజీనగర్ లోని సయ్యద్ అబ్దుల్ అజీజ్(అన్నుబాయి) ప్రజలకు అందించాల్సిన రేషన్ బియ్యాని బ్లాక్ మార్కెట్ కు తరలిస్తున్నట్లు వచ్చిన సమాచారంతో ఎస్ వో టీ పోలీసులు మంగళవారం మధ్యాహ్నం దాడి జరిపి రెడ్ హ్యండెడ్ గా పట్టుకున్నారు.

యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లికి చెందిన భూక్య రాజేందర్ బాలాజీనగర్ లోని సయ్యడ్ అబ్దుల్ అజీజ్ రేషన్ దుకాణం నుండి 12 క్వింటాళ్ల రేషన్ బియ్యాని కొనుగోలు చేసి తన వాహనంలో తరలించేందుకు యత్నించాడు. అప్పటికే మాటు వేసి ఉన్న ఎస్ వో టీ పోలీసులు రెడ్ హ్యండెడ్ గా పట్టుకుని అబ్దుల్ అజీజ్, రాజేందర్ లను అరెస్టు చేసి తరలిసిస్తున్న బియ్యం, వాహనాన్ని సీజ్ చేసి ఘట్ కేసర్ పోలీసులకు అప్పగించారు. అక్రమాలకు పాల్పడిన అబ్దుల్ అజీజ్ రేషన్ షాప్ ను సీజ్ చేసి కేసు దర్యాప్తు జరుపుతున్నట్లు ఘట్ కేసర్ ఇన్ స్పెక్టర్ పరశురాం తెలిపారు.