22-12-2025 01:04:30 PM
నివాళులు అర్పించిన ఎస్పి నితిక పంత్
కుమ్రం భీం ఆసిఫాబాద్(విజయక్రాంతి): మాజీ కేంద్ర మంత్రి గడ్డం వెంకటస్వామి(Gaddam Venkata Swamy) వర్ధంతిని ప్రభుత్వ ఆదేశాల మేరకు ఆసిఫాబాద్ జిల్లా పోలీస్ కార్యాలయంలో అధికారికంగా నిర్వహించారు. జిల్లా ఎస్పీ నితికా పంత్ ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు.ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ సుదీర్ఘకాలం పాటు కేంద్ర మంత్రిగా, పార్లమెంటు సభ్యునిగా ప్రాతినిథ్యం వహించిన వెంకటస్వామి దళిత, బడుగు, బలహీన, అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం విశేషంగా కృషి చేశారని గుర్తు చేశారు. ఆయన సేవలను గుర్తిస్తూ నిరంతరం స్మరించుకునేలా ప్రభుత్వం అధికారికంగా జయంతి, వర్ధంతి వేడుకలను నిర్వహిస్తోందని అన్నారు. ఈ కార్యక్రమంలో పోలీస్ అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.