calender_icon.png 22 December, 2025 | 2:29 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రభుత్వ పథకాలను ప్రజలకు చేరుస్తా

22-12-2025 12:55:51 PM

సర్పంచుల ఫోరం అధ్యక్షుడు పెద్దిరెడ్డి అశోక్ రెడ్డి 

గజ్వేల్,(విజయక్రాంతి): నమ్మకంతో తనను గెలిపించిన ప్రజలందరికీ ప్రభుత్వ పథకాలను అందేలా చూస్తానని పిడిచేడ్ గ్రామ సర్పంచ్, మండల సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడు పెద్దిరెడ్డి అశోక్ రెడ్డి అన్నారు. సోమవారం గ్రామ ప్రత్యేక అధికారి, సిడిపిఓ  సరిత సమక్షంలో పిడిచేడు గ్రామ సర్పంచ్ గా ప్రమాణ స్వీకారం చేసి అశోక్ రెడ్డి బాధ్యతలు చేపట్టారు.

ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు, గ్రామస్తులు అశోక్ రెడ్డిని ఘనంగా సన్మానించారు. ఎంతో నమ్మకంతో తనను సర్పంచ్ గా గెలిపించిన ప్రజలందరికీ ఎల్లవేళలా అందుబాటులో ఉంటానని, ప్రజల సమస్యలే తన సమస్యలుగా భావించి వెంటవెంటనే పరిష్కరిస్తానని ఈ సందర్భంగా అశోక్ రెడ్డి హామీ ఇచ్చారు. డిసిసి అధ్యక్షురాలు అంక్షారెడ్డి, మాజీ ఎమ్మెల్యే తూముకుంట నర్సారెడ్డి ల సహకారంతో గ్రామాభివృద్ధికి కృషి చేస్తానన్నారు. కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి కల్పన, వార్డు సభ్యులు, కాంగ్రెస్ నాయకులు,గ్రామస్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ప్రమాణ స్వీకారం సందర్భంగా గ్రామంలో  సర్పంచ్ అశోక్ రెడ్డిని గ్రామస్తులు వీధి వీధిన ఊరేగించారు.