22-12-2025 12:53:06 PM
చివ్వెంల,(విజయక్రాంతి): చివ్వెంల మండల పరిధిలోని పిల్లలజెగ్గుతండ గ్రామపంచాయతీలో నూతనంగా ఎన్నికైన సర్పంచ్, ఉపసర్పంచ్ మరియు వార్డు సభ్యుల ప్రమాణస్వీకార కార్యక్రమం సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నూతన సర్పంచ్‌గా ఎన్నికైన బానోత్ నాగేశ్వరరావు అధికారికంగా ప్రమాణస్వీకారం చేసి బాధ్యతలు స్వీకరించారు.
ఉపసర్పంచ్‌తో పాటు గ్రామపంచాయతీకి చెందిన వార్డు సభ్యులు కూడా ఎన్నికల సంఘం నిబంధనల మేరకు ప్రమాణం చేశారు. సంబంధిత అధికారులు ప్రమాణం చేయించి బాధ్యతలు అప్పగించారు.ప్రమాణస్వీకార కార్యక్రమానికి గ్రామ పెద్దలు, ప్రజాప్రతినిధులు, అధికారులు, గ్రామస్థులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ఈ సందర్భంగా సర్పంచ్ బానోత్ నాగేశ్వరరావు మాట్లాడుతూ, గ్రామ అభివృద్ధే లక్ష్యంగా పారదర్శక పాలన అందిస్తామని, ప్రజల సమస్యలను ప్రాధాన్యంగా తీసుకుని పరిష్కరిస్తామని తెలిపారు. గ్రామంలో మౌలిక సదుపాయాల అభివృద్ధి, సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికి చేరేలా కృషి చేస్తామని నూతన పాలకవర్గం హామీ ఇచ్చింది. కార్యక్రమం శాంతియుతంగా, క్రమబద్ధంగా ముగిసింది.