calender_icon.png 1 May, 2025 | 7:58 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గుర్తు తెలియని వ్యక్తి మృతి

28-04-2025 12:50:28 AM

పటాన్ చెరు, ఏప్రిల్ 27 : అమీన్ పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందాడు. సీఐ నరేశ్ తెలిపిన వివరాల మేరకు అమీన్ పూర్ మున్సిపల్ పరిధి లోని శ్రీ వాణినగర్ కాలనీ రోడ్డు పక్కన గుర్తు తెలియని వ్యక్తి అనారోగ్యంతో పడి ఉన్నట్లు  ఆదివారం ఉదయం సమాచారం రావడంతో 108 వాహనంలో పటాన్ చెరు ప్రభుత్వ దవాఖానకు తరలించి చికిత్స అందిస్తుండగా చనిపోయాడని చెప్పారు.

చనిపో యిన వ్యక్తి వయసు అందాజా అరవై ఏండ్లు పైబడి ఉంటుందన్నారు. మృతదేహం  పటాన్ చెరు ప్రభుత్వ ఆసుపత్రిలో ఉందన్నారు. గుర్తించిన వారు అమీన్ పూర్ పోలీస్ స్టేషన్ 8712656728, 8712661842 నంబర్లకు సంప్రదించాలనికోరారు.

మనస్థాపంతో మహిళ ఆత్మహత్య

 కొండపాక,ఏప్రిల్ 27: ఆర్థిక ఇబ్బందులకు మనస్థాపం చెంది ఇంట్లో ఉరి వేసు కొని మహిళ  మృతి చెందినట్లు కుకునూరుపల్లి ఎస్ ఐ శ్రీనివాస్ తెలిపారు. కుకునూ రుపల్లి మండలం కోనాయిపల్లి గ్రామానికి చెందిన దున్నపోతుల కలవ్వ (38) తన భర్తతో విడాకులు తీసుకొని కూతురు శిరీష(10)తో కలిసి జీవనం సాగిస్తుంది.

కుటుం బ పోషణ కోసం చేసిన ఆర్థిక ఇబ్బందులకు  మనస్థాపం చెంది తన ఇంట్లో ఉరి వేసుకొని మృతి చెందింది. కుటుంబ సభ్యుల ఫిర్యా దు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు కుకునూరుపల్లి ఎస్ ఐ శ్రీనివాస్ తెలిపారు.