calender_icon.png 13 May, 2025 | 2:27 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బొలెరో ట్రాలీ-లారీ ఢీ.. నలుగురు దుర్మరణం

13-05-2025 10:41:13 AM

హైదరాబాద్,(విజయక్రాంతి): పల్నాడు జిల్లాలో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది ఈ ఘటన లో నలుగురు దుర్మరణం చెందారు. వినుకొండ మండలం శివాపురం వద్ద బొప్పాయి కాయల లోడ్ తో వెళ్తున్న బొలెరో ట్రాలీని లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నలుగురు అక్కడికక్కడే మృతి చెందగా, మరో ముగ్గురికి తీగ్రాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకోని మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం సమీపంలోని దవాఖానకు తరలించారు. మృతులంతా ప్రకాశం జిల్లా యర్రగొండపాలెం మండలం గడ్డమీదపల్లికి చెందిన వ్యవసాయ కూలీలుగా పోలీసుల ప్రాథమిక విచారణలో తెలింది. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు.