calender_icon.png 3 May, 2025 | 10:58 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కులగణ నిర్ణయం చారిత్రాత్మకం

02-05-2025 10:16:10 PM

ఎస్సీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే కొండేటి శ్రీధర్

హనుమకొండ,(విజయక్రాంతి): హసన్ పర్తి మండల కేంద్రంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తీసుకున్న కుల గణన నిర్ణయం చరిత్రత్మకమైందని కృతజ్ఞతలు తెలుపుతూ హసన్ పర్తి మండల అధ్యక్షులు మారం తిరుపతి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎస్సీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే కొండేటి శ్రీధర్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, 66వ డివిజన్ కార్పొరేటర్ గురుమూర్తి శివకుమార్ లు హాజరై, కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ  మోడీ ప్రభుత్వ నిర్ణయం వల్ల సామాజిక న్యాయం మరింత బలపడుతుందని పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకుని బూటకపు మాటలు మానుకోవాలని వారు హెచ్చరించారు. అన్ని సామాజిక వర్గాలకు సమాన న్యాయం జరుగుతుంది అని ప్రధాని మోడీకి  కృతజ్ఞతలు తెలుపుతూ పార్టీ నాయకులతో పాలాభిషేకం చేశారు.


ఈ కార్యక్రమంలో వరంగల్ పార్లమెంట్ కన్వీనర్ తాళ్లపల్లి కుమారస్వామి, రైల్వే బోర్డు మెంబర్స్ దాసరి రాజు, హసన్ పర్తి మండల పార్టీ అధ్యక్షుడు మారం తిరుపతి, మేకల హరిశంకర్, తాళ్ల శ్యామ్, డివిజన్ ప్రధాన కార్యదర్శి మట్టెడ సుమన్, చకిలం రాజేశ్వరరావు, పెద్దమ్మ శ్రీనివాస్, దాట్ల సునీల్, శీలం బిక్షపతి, రామిశెట్టి అశోక్, రఘుపాల్ రెడ్డి, జనగాం రవీందర్, పట్టాభి రెడ్డి, కుక్కల జ్ఞానేశ్వర్, తిరుపతి రెడ్డి, కందుకూరి శ్రీకాంత్, కోయ్యాడ రాజు పలువురు నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు.