గజ్వేల్ ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాలలో విద్యార్థులకు ఉచిత పాఠ్యపుస్తకాల పంపిణీ
01-07-2026 06:22 PM
గజ్వేల్: స్థానిక బాలుర ఎడ్యుకేషన్ హబ్‌లోని జూనియర్ కళాశాలలో విద్యార్థులకు ఉచిత పాఠ్యపుస్తకాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపల్ శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ... మొదటి సంవత్సరానికి గాను ప్రభుత్వ కళాశాలలో దరఖాస్తు చేసుకున్న విద్యార్థులకు శుభాకాంక్షలు తెలిపారు. ప్రభుత్వం అందించే అన్ని రకాల సదుపాయాలను విద్యార్థులు సద్వినియోగం చేసుకుని మంచి ఫలితాలు సాధించాలని, కళాశాలకు, తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలని ఆయన సూచించారు. విద్యార్థులు క్రమశిక్షణతో చదివి ఉన్నత లక్ష్యాలను చేరుకోవాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో విద్యార్థులు, కళాశాల సిబ్బంది పాల్గొన్నారు.






