02-05-2025 10:20:42 PM
గాలి దుమారాలతో తీవ్రంగా నష్టపోయిన వైనం
ప్రభుత్వం ఆదుకోవాలని వేడుకోలు
మందమర్రి,(విజయక్రాంతి): జిల్లాలో గురువారం రాత్రి గాలి దుమారం బీభత్సానికి జిల్లా వ్యాప్తంగా ఉన్న మామిడి కాయలు నేల రాలి రైతుల ఆశలు అడియాశలయ్యాయని పలువురు మామిడి రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జిల్లావ్యాప్తంగా నెన్నెల, బెల్లంపల్లి, మందమర్రి భీమారం జైపూర్ మండలాలు మామిడి తోటలకు ప్రసిద్ధి. ఇక్కడ మామిడికాయలు మన రాష్ట్రం తో పక్క రాష్ట్రాలకు ఎగుమతి అవుతుంటాయి. గత కొద్ది సంవత్సరాలుగా ప్రకృతి మామిడి రైతులపై పగ పెట్టినట్లుగా వ్యవహరిస్తుండటం చేతికొచ్చిన మామిడి ప్రకృతి వైపరీత్యాలతో నేల ర్యాలీ కన్నీరు మిగిలిస్తున్నాయని పలువురు రైతులు ఆందోళన చెందుతున్నారు.మామిడి తోటలపై ఆధారపడ్డ సుమారు 2000 మంది రైతులు దశాబ్దాలుగా మామిడి తోటలను పెంచుతూ మామిడిపై ఆధారపడి జీవిస్తున్నారు.
ప్రకృతి వైపరీత్యాల మూలంగా....
మామిడి రైతులపై ప్రకృతి పగపట్టిందని గత అనేక సంవత్సరాలుగా గాలి దుమారాలు అకాల వర్షాలు మూలంగా మామిడి పంట తీవ్రంగా నష్ట మామిడి రైతులు కన్నీటి పర్యటనవుతున్నారు. పంట చేతికి సమయానికి ఒకవైపు ప్రకృతి వైపరీత్యాలు మరోవైపు కోతుల దండయాత్రలతో పంట చేతికచే పరిస్థితి లేకుండా పోతుందని ఆరుగాలం తోటలో నమ్ముకుని జీవిస్తున్న తమకు ఏదో ఒక రూపంలో నష్టం వాటిల్లు తుందని పలువురు ఆందోళన చెందుతున్నారు.ప్రస్తుత సంవత్సరం పంట అంతంత మాత్రమే ఉండగా వాతావరణం మార్పులు, తేనె మంచు పురుగుల దాడి మామిడి రైతులకు తీవ్ర నష్టానికి గురి చేస్తున్నాయి. ఇటీవల కురిసిన అకాల వర్షాలకు తోడు గురువారం గాలి దుమారం బీభత్సంతో మామిడి కాయలు నేల రాలడమే కాకుండా మామిడి చెట్లు విరిగిపడడంతో రైతులకు కన్నీళ్లే మిగిలాయని పలువురు మామిడి రైతులు రోదిస్తున్నారు.
ప్రభుత్వం ఆదుకోవాలి...
ప్రకృతి వ్యాపరిచాల మూలంగా మామిడి పండ్లను కోల్పోయిన రైతులను ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించి ఆదుకోవాలని పలువురు మామిడి రైతులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. గత కొద్ది సంవత్సరాలుగా మామిడి పంట ఆశాజనకంగా లేదని పండిన పంటకు మార్కెటింగ్ లేక నష్టపోవడం ఒక వంతు అయితే ప్రకృతి వైపరీత్యాల మూలంగా పంట నేల రాలి ఆశలు సన్నగిల్లుతు న్నాయని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి మామిడి రైతులను ఆదుకొని నష్టపరిహారం చెల్లించాలని పలువురు కోరుతున్నారు.