02-05-2025 12:51:18 AM
నాగర్ కర్నూల్ మే 1 (విజయక్రాంతి) నాగర్ కర్నూల్ జిల్లా తాడూరు మండలం తుమ్మలసుగూరులో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. పిండిగిర్ని దుకాణంలో విద్యుత్ షాక్ తో తల్లి, కుమారుడు ఇద్దరూ మృత్యువాత పడ్డారు. ఈ ఘటన గురువారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సర్వోజు వడ్ల జయమ్మ(40) కుటుంబ పోషణ కోసం పిండి గిర్ని నడుపుతున్న క్రమంలో కుమారుడు శ్రీకాంత్ పది పూర్తి చేసుకొని మంగళవారం వెలువడిన ప ది ఫలితాల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచాడు.
తల్లికి సహాయంగా పక్కనే ఉన్నాడు. బుధవారం ఉద యం పిండి గిర్ని పడుతుండగా విద్యుత్ షాక్ తో వణుకుతూ కనిపించాడు వెంటనే తల్లి గమనించి అతని కాపాడపోయింది ఆమెకు కూడా విద్యుత్ షాక్ తగిలి ఇద్దరు విలవిలలాడుతుండగా పక్కనే ఉన్న కూతురు శిరీష కర్రతో విద్యుత్ మీటర్ను ఆఫ్ చేసింది. ఇద్దరూ కుప్ప కూలి పడిపో గా కుటుంబ సభ్యులు వెంటనే జనరల్ ఆసుపత్రికి తరలించారు.
కానీ అప్పటికే మృతి చెందిన ట్లు వైద్యులు నిర్ధారించారు. వీరి కుటుంబంలోనే కాకుండా గ్రామంలో తీవ్ర విషాదం అలుముకుంది. తన కుమారుడు10వ తరగతి పూర్తి చేసుకుని ఉత్తమ ఫలితాన్ని పొందిన సంతోషం ఆ ఇంట ఎక్కువసేపు నిలవలేదు. దీనిపై పోలీసుల కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.