02-05-2025 10:34:48 AM
దుబాయ్ పారిపోయిన మొయినుద్దీన్
ఇప్పటికే ఈ కేసులో 17 మంది అరెస్ట్
గొర్రెల పంపిణీ కుంభకోణంలో మొయినుద్దీన్ ఏ1
హైదరాబాద్: గొర్రెల పంపిణీ కుంభకోణం కేసు దర్యాప్తులో కీలక అంశాలు వెలుగులోకి వచ్చాయి. గొర్రెల పంపిణీ కుంభకోణం(Sheep Distribution Scam) కేసులో ఏసీబీ సోదాలు చేస్తోంది. కాంట్రాక్టర్ మొయినుద్దీన్ నివాసంలో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. ఏసీబీ కేసు నమోదు తర్వాత మొయినుద్దీన్(Contractor Moinuddin) దుబాయ్ పారిపోయాడు. గొర్రెల కొనుగోలు చేసి రైతులకు డబ్బులు ఇవ్వకుండా మొయినుద్దీన్ ఎగ్గొట్టాడు. ఏసీబీ దర్యాప్తులో రూ. 700 కోట్లు పక్కదారి పట్టాయని ఏసీబీ గుర్తించింది.
కేసులో పశుసంవర్ధక శాఖ అధికారులతో పాటు మొత్తం 17 మందిని అరెస్ట్ చేశారు. గొర్రెల పంపిణీ కుంభకోణం కేసులో మొయినుద్దీన్ ప్రధాన నిందితుడుగా ఉన్నాడు. మొయినుద్దీన్ నివాసంలో సోదాల్లో కీలకమైన పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. గొర్రెల పంపిణీ కుంభకోణంలో మొయినుద్దీన్ ఏ1 ఉన్నారు. ఏసీబీ నమోదు చేసిన కేసు ఆధారంగా ఈడీ దర్యాప్తు చేస్తోంది. ఇప్పటికే పశుసంవర్ధక శాఖ నుంచి ఈడీ అధికారులు వివరాలు సేకరించారు. గత రాత్రి మొయినుద్దీన్ భార్య ఇంట్లో ఏసీబీ సోదాలు చేపట్టింది. కోకాపేట్ లోని మూవీ టవర్(Kokapet Movie Tower) లో మొయినుద్దీన్ భార్య నివాసముంటుంది. మొయినుద్దీన్ భార్య ఖాతాకు నగదు బదిలీ అయినట్లు అధికారులు గుర్తించారు. తొలుత ఏసీబీ సోదాలను మొయినుద్దీన్ భార్య అడ్డుకున్నారు. సెర్చ్ వారెంట్ చూపించిన ఏసీబీ అధికారులు సోదాలు చేశారు. మొయినుద్దీన్ భార్ ఇంట్లో అర్ధరాత్రి 2.30 గంటల వరకు ఏసీబీ సోదాలు చేసింది. సోదాల తర్వాత 2 కార్లను సీజ్ చేసి ఏసీబీ కార్యాలయానికి తరలించారు.