02-05-2025 10:01:53 AM
ఆదర్శంగా నిలిచిన గోరీలాపాడుతండ గ్రామస్తులు..
తండ్రి లేని అమ్మాయికి పెళ్లికి రూ 50 వేలు సహాయం..
పదవ తరగతిలో ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్దులకు సన్మానం..
కూసుమంచి,(విజయక్రాంతి): ఆ ఊరిలోని ఉద్యోగులు అందరూ కలిసి ఒక సంఘాన్ని ఏర్పాటు చేసుకున్నారు.. ఆ సంఘం ద్వారా తమ ఊరులోని పేదలకు ,విద్యార్దులకు ఆర్దికంగా అండగా నిలుస్తూ పలువురికి ఆదర్శంగా నిలిచారు. వివరాలు ఇలా ఉన్నాయి.. కూసుమంచి మండలం గోరీలపాడుతండ గ్రామంలోని ఉద్యోగులు అందరూ కలిసి ఉద్యోగుల సహకార సంఘం ఆధ్వర్యంలో తండ్రి లేని పేద అమ్మాయి తేజావత్ అఖిల వివాహానికి రూ 55,516/- ఆర్థిక సహాయం చేశారు. మాజీ ఎంపీపీ శ్రీ బానోతు శ్రీనివాస్ సహకారంతో మరో రూ 26వేలు అందజేసినారు.
మొత్తం రూ 81,516 గ్రామ పెద్దల సమక్షంలో కమిటీ వారు అందజేసినారు. కూసుమంచి తహశీల్దార్ కరుణశ్రీ పెళ్లి కూతురుకు రూ 2,500, తలంబ్రాలు చీర అందజేశారు. అనంతరం ఇంటర్ విద్యలో 900 మార్కులు పైగా సాధించినటువంటి విద్యార్థులు, 10వ తరగతిలో 500 పైగా మార్కులు సాధించిన విద్యార్థులకు ఘనమైన సన్మానం చేశారు.. కమిటీ అధ్యక్షులు బి.చందా మాట్లాడుతూ.. విద్యార్థులు బాగా చదువుకొని ఉన్నతమైన స్థితిలోకి వచ్చినప్పుడు ఎంతో కొంత గ్రామపంచాయతీ రుణం తీర్చుకోవాలని తెలియజేశారు.. మాజీ ఎంపీపీ శ్రీనివాస్ మాట్లాడుతూ.. ఈరోజు మీకు చేసినటువంటి ఈ చిన్న సన్మానం భవిష్యత్తులో మీరు ఉన్నత స్థాయిలో ఉండటానికి ఉపయోగపడుతుందని, జన్మభూమి ఋణం ఎప్పటికైనా తీసుకోవడానికి మీరు ఆలోచించాలన్నారు. ఈ సమావేశంలో ప్రధాన కార్యదర్శి వెంగళరావు, సీతమ్మ తల్లి గుడి అధ్యక్షులు టి రామకోటి ప్రధాన కార్యదర్శి కోటేశ్వరావు చైర్మన్ బానోత్ బాసు కార్యదర్శి టీ మల్ల ట్రెజరర్ బి. కోటేశ్వరరావు,రవి ,ఇందిరా,రాజ్ కుమార్, వెంకన్న, గోర్యా, రమేష్, రిటైర్ ఉద్యోగస్తులు బి చందా నాయక్ బి హరిసింగ్ నాయక్ గ్రామ పెద్దలు గాంగు, శ్రీను, నాగులు, వెంకటేష్,కుమార్ ,విద్యార్థులు పాల్గొన్నారు..