15 April, 2026 | 8:48 AM

హైదర్‌గూడ మున్సిపల్ ఛాంబర్స్ కార్యాలయంలో అగ్నిప్రమాదం

02-05-2025 11:11 AM

హైదరాబాద్: హైదర్‌గూడలో మున్సిపల్ ఛాంబర్స్ కార్యాలయం(Municipal Chambers Office)లో శుక్రవారం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. విద్యుదాఘాతంతో మంటలు చెలరేగాయి. స్థానికుల సమాచారంతో హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపుచేశారు. అగ్నిప్రమాదంలో కార్యాలయంలో ఉన్న పత్రాలు, వస్తువులు దగ్ధం అయ్యాయి. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.