calender_icon.png 2 May, 2025 | 9:15 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పదవ తరగతి ఫలితాల్లో ఎస్సీ హస్టల్ విద్యార్ది టాప్

02-05-2025 10:18:49 AM

కూసుమంచి, (విజయక్రాంతి): కూసుమంచి మండల కేంద్రంలోని ఎస్సీ  బాలికల హస్టల్ లో టెన్త్ పరీక్షలకు హాజరైన విద్యార్ధి కూసుమంచి మండలంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లోనే అత్యధిక మార్కులు సాదించిన విధ్యార్ధినిగా నిలిచారు. మండలంలోని తొమ్మిది ప్రభుత్వ జెడ్పి హైస్కూళ్ళు ఉండగా అన్నింటిలో కల్లా కూసుమంచి జెడ్పి హైస్కూల్ లో చదివిన ఎస్సీ బాలికల హస్టల్ విద్యార్ధిని సత్యనిశి మొత్తం 600 మార్కులకు గాను 547 మార్కులు సాధించి  ప్రభుత్వ విద్యార్దుల్లో మండలంలోనే అగ్రశేణిగా నిలిచారు. సత్య నిశీ మండలంలోనే టాపర్ గా నిలవడంతో ఆ విద్యార్దిని పలువురు అభినందించారు. ప్రభుత్వ బాలికల ఎస్సీ హస్టల్ లో ఉంటూ కష్టపడి మండలంలోనే టాపర్ గా నిలవడంతో ప్రశంసించారు. మండలంలోనే టాపర్ గా నిలిచిన సత్యనిశిని జెడ్పి హైస్కూల్ ప్రధానోపాధ్యాయులు రాయల వీరస్వామి, ఎస్సీ బాలికల వసతి గ్రహ సంక్షేమ అధికారిణి జి వినోధ అభినందించారు.