02-05-2025 12:50:56 AM
రాచకొండ సీపీ సుధీర్ బాబు
మేడ్చల్, మే 1 (విజయ క్రాంతి): ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండాలని రాచకొండ పోలీస్ కమిషనర్ జి. సుదీర్ బాబు అన్నారు. గురువారం నేరేడుమెట్లోని సీపీ కార్యాలయంలో మెగా హెల్త్ క్యాంప్ నిర్వహించారు. ఈ సందర్భంగా సుధీర్ బాబు మాట్లాడుతూ ఎప్పటికప్పుడు పరీక్షలు నిర్వహించుకుని ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకోవాలన్నారు. ఆరోగ్య శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు. ఈ ఆరోగ్య శిబిరానికి 300 మందికి పైగా హాజరయ్యారు. మామోగ్రఫీ, గర్భాశయ క్యాన్సర్, క్యాన్సర్, ఎక్స్ రే, అల్ట్రా సౌండ్, స్కానింగ్ తో సహా వివిధ క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు చేశారు. పోలీస్ ఐ కేర్ హాస్పిటల్స్ ఉచిత కంటి పరీక్షలు, సౌజన్య దంత సంరక్షణ ఆసుపత్రి వారు దంత పరీక్షలు నిర్వహించి అవసరమైన పరికరాలు అందించారు.
డాక్టర్ కే కల్పనా రఘునాథ్ క్యాన్సర్ని ముందుగానే గుర్తించడం, నివారణ, చికిత్స, జీవన శైలి మార్పులపై అవగాహన కల్పించారు. బసవతారకం ఆసుపత్రి వారు క్యాన్సర్ కు సంబంధించి పరీక్షలు నిర్వహించి, వైద్య సహాయం అందించారు. ఈ కార్యక్రమంలో డిసిపిలు పద్మజ, ప్రవీణ్ కుమార్, అరవింద్ బాబు, ఉషా విశ్వనాథ్, నాగలక్ష్మి, ఉమెన్ ఫోరం జాయింట్ సెక్రెటరీ రాధికానాథ్, ఆర్ కే ఎస్ సి చీఫ్ కోఆర్డినేటర్ సావిత్రి తదితరులు పాల్గొన్నారు.