calender_icon.png 2 May, 2025 | 9:22 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నేడు ఢిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి

02-05-2025 09:28:18 AM

హైదరాబాద్: జాతీయ జనాభా లెక్కల్లో కుల గణనను చేర్చాలనే కేంద్ర ప్రభుత్వ నిర్ణయంపై చర్చించడానికి కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (Congress Working Committee) శుక్రవారం సమావేశం కానుందని పార్టీ వర్గాలు గురువారం తెలిపాయి. అక్బర్ రోడ్‌లోని కాంగ్రెస్ ప్రధాన కార్యాలయంలో సాయంత్రం 4 గంటలకు ఈ సమావేశం జరగనుంది.  ఈ నేపథ్యంలోనే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(Chief Minister Revanth Reddy) నేడు హస్తినకు వెళ్లనున్నారు. 

కులగణన అంశంపై ప్రత్యేకంగా నేడు సీడబ్ల్యూసీ(Congress CWC meeting) సమావేశంలో చర్చించున్నారు. ఈ సమావేశానికి కాంగ్రెస్‌ పాలిత మూడు రాష్ట్రాల సీఎంలు హాజరుకానున్నారుకుల గణన(Caste enumeration)పై చర్చ, తదుపరి కార్యాచరణను సీడబ్ల్యూసీ ఖరారు చేయనుంది. దేశ వ్యాప్తంగా జనాభా లెక్కల సందర్భంగా కుల గణనను కూడా చేర్చాలని నిర్ణయించిన నేపథ్యంలో తమ అనుభవాలను కేంద్ర ప్రభుత్వానికి అందించడానికి తెలంగాణ సిద్ధంగా ఉందని రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్పారు. జనాభా లెక్కల్లో కుల గణన అంశం చేర్చాలన్న నిర్ణయాన్ని ముఖ్యమంత్రి స్వాగతిస్తూ అందుకు ప్రధానమంత్రికి, కేంద్ర మంత్రివర్గానికి అభినందనలు తెలియజేశారు.